అత్తారింటికి దారేది మూవీతో భారీ హిట్ అందుకున్న త్రివిక్రమ్, ఆ తరువాత ఆయన చేసిన చిత్రాలలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఓ అందమైన మాజీ హీరోయిన్ కి కీలక పాత్ర ఉండేలా చూసుకుంటున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో విలన్ ఉపేంద్ర భార్యగా స్నేహాను తీసుకున్నారు. ఇక నితిన్ హీరోగా తెరకెక్కిన అ ఆ మూవీ నదియాకు అత్తగా ప్రాముఖ్యం ఉన్న రోల్ ఇవ్వడం జరిగింది. పవన్ 25వ చిత్రంగా వచ్చిన అజ్ఞాతవాసి మూవీలో ఆయన తల్లిగా హీరోయిన్ కుష్బూని తీసుకున్నారు. 

అలాగే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మొదటిసారి చేసిన అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ తల్లిగా హీరోయిన్ దేవయాని, జగపతిబాబు భార్య పాత్ర కోసం ఈశ్వరి రావ్ ని తీసుకున్నారు. ఇక త్రివిక్రమ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో మూవీలో మరో మాజీ హీరోయిన్ టబుని అల్లు అర్జున్ తల్లి పాత్ర కోసం తీసుకున్నారు. తన ప్రతి చిత్రంలో కీలక పాత్ర కోసం మాజీ హీరోయిన్ ని తీసుకొనే సాంప్రదాయం పాటిస్తున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ 30 మూవీ కొరకు ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తిరేపుతుంది. 

ఎన్టీఆర్ 30మూవీపై భారీ అంచనాలు ఉండగా, ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ ప్రచారం సాగుతుంది. రెండు భిన్నమైన రోల్స్ లో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం. ఎన్టీఆర్ 30లో త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఓ మాజీ హీరోయిన్ ని ఎన్టీఆర్ కి అత్తగానో, అమ్మగానో నటింపచేస్తారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్థినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆ వేటలో త్రివిక్రమ్ ఉన్నారట.