త్రివిక్రమ్‌ తన సినిమాల టైటిల్స్ కి `అ` సెంటిమెంట్‌ని ఫాలో అవుతుంటారు. కానీ ఇప్పుడు మహేష్‌బాబుతో చేస్తున్న సినిమాకి మరో సెంటిమెంట్‌ని యాడ్‌ చేస్తున్నారట. 

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ చాలా రోజుల తర్వాత రిపీట్‌ అవుతుంది. 13ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్నారు. వీరిద్దరు కలిసి చేసిన మొదటి సినిమా `అతడు` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పటికీ ఇది టీవీలో మంచి టీఆర్‌పీతో రన్‌ అవుతుంది. అత్యధికసార్లు టీవీలో ప్రసారమైన సినిమాగానూ రికార్డు క్రియేట్‌ చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన `ఖలేజా` సక్సెస్‌ కాలేదు. దీంతో చాలా గ్యాప్‌ వచ్చింది. 

ఇన్నాళ్లకి మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `ఎస్‌ఎస్‌ఎంబీ28` సినిమా రూపొందుతుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తన సినిమాలకు సంబంధించి ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతుంటారు త్రివిక్రమ్‌. టైటిల్‌ సెంటిమెంట్‌ కంటిన్యూ చేస్తున్నారు. `అ` సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్‌తో `అయోధ్యలో అర్జునుడు`, `అతడే ఓ సైన్యం` లాంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట. మరి టైటిల్‌ ప్రకటన ఎప్పుడు వస్తుందనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. 

తాజాగా మరో సెంటిమెంట్‌ తెరపైకి వచ్చింది. రిలేషన్‌ షిప్స్ కి సంబంధించి త్రివిక్రమ్‌ తన సెంటిమెంట్‌ని కొనసాగించబోతున్నారట. అందులో భాగంగా `ఎస్‌ఎస్‌ఎంబీ28`లో మదర్‌ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారని సమాచారం. గతంలో `అతడు`లో తాత సెంటిమెంట్‌, `సన్నాఫ్‌ సత్యమూర్తి`లో ఫాదర్‌ సెంటిమెంట్‌ని `అజ్ఞాతవాసి`లో అత్త సెంటిమెంట్‌ని వర్కౌట్‌ చేశారు. ఈ సెంటిమెంట్లే ఈ సినిమాకి బలంగా నిలిచాయి. విజయంలో భాగమయ్యాయి. మళ్లీ ఆ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేయబోతున్నారట త్రివిక్రమ్‌. మహేష్‌ సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌ ని చూపించబోతున్నారట. బలమైన మదర్‌ సెంటిమెంట్‌ని రాస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు త్రివిక్రమ్‌. ఇందులో మహేష్‌ సిగరేట్‌ తాగుతూ, మిర్చీ ఎగిరి పడుతుండగా, వెనకాల లారీ, సైడ్లో కారు వస్తుండగా, ఊరమాస్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ మాస్‌ ఎలిమెంట్లతోపాటు మదర్‌ సెంటిమెంట్‌ కూడా బలంగా ఉంటుందని, దాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్టు తెలిసింది. ఇందులో మదర్‌ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రమ్యకృష్ణ, రాధ, రేఖ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌ లేదని, అసలు మ్యాటర్‌ వేరే ఉందని అంటున్నారు. నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. పూజా హెగ్డే కథానాయికగా, శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.