హీరో శింబుతో త్రిష పెళ్లి..?
గతంలో సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో నిశ్చితార్ధం వరకు వెళ్లి.. ఏవో కారణాలతో చివరి నిమిషంలో త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ నటుడిని ఆమె పెళ్లాడనుందనే వార్తలు వినిపించాయి.
బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ మళ్లీ వార్తలు రావడం మొదలయ్యాయి. సెలబ్రెటీల పెళ్లి విషయాలపై ఎప్పుడూ అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి అంటే.. ఎప్పుడు చేసుకుంటున్నారు..? ఎవరిని చేసుకుంటున్నారు అంటూ ఊహాగానాలు మొదలౌతాయి.
కాగా.. హీరోయిన్ త్రిష విషయంలో మాత్రం ఇప్పటి వరకు చాలా సార్లు జరిగింది. ఇప్పటికే చాలా సార్లు ఆమె పెళ్లి గురించి వార్తలు రాగా.. మరోసారి కోలివుడ్ లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో నిశ్చితార్ధం వరకు వెళ్లి.. ఏవో కారణాలతో చివరి నిమిషంలో త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ నటుడిని ఆమె పెళ్లాడనుందనే వార్తలు వినిపించాయి. ఆ నటుడి విషయంలో స్పందించిన త్రిష.. అతను కేవలం తనకు ప్రాణ స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.
అయితే.. ఇప్పుడు మళ్లీ.., ఓ హీరోని త్రిష పెళ్లాడనుందంటూ వార్తలు వస్తున్నాయి. హీరో శింబుని త్రిష పెళ్లిచేసుకోబోతోందట. కోలివుడ్ లో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎంతవరకు నిజమో మాత్రం తెలీదు. దీనిపై ఎవరో ఒకరు స్పందించే వరకు ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే... హీరో శింబు గతంలో నయనతారతో ప్రేమాయణం తర్వాత హన్సికతో ప్రేమ, పెళ్లి వంటి వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలోనే వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత హన్సిక కామ్‌గా సినిమాలు చేసుకుంటుంది. ఇప్పుడు శింబు, త్రిష పెళ్లి ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. గతంలో.. వీరిద్దరూ కలిసి ‘విన్నైతాండి వరువాయ’ (తెలుగులో ‘ఏమాయ చేసావే’) చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీ సీక్వెల్‌లో కూడా వీరు నటించబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది.