యానిమల్ చిత్రంతో తృప్తి డిమ్రి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో తృప్తి డిమ్రి యువతకి క్రష్ గా మారిపోయింది. యానిమల్ చిత్రం సక్సెస్ తో తృప్తి డిమ్రికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
యానిమల్ చిత్రంతో తృప్తి డిమ్రి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో తృప్తి డిమ్రి యువతకి క్రష్ గా మారిపోయింది. యానిమల్ చిత్రం సక్సెస్ తో తృప్తి డిమ్రికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తృప్తి డిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది.
ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తృప్తి తాజాగా మరో సంచలనం సృష్టించింది. ముంబైలోని బాంద్రాలో తృప్తి డిమ్రివిలాసవంతమైన బంగ్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తృప్తి డిమ్రికి క్రేజ్ వచ్చింది యానిమల్ చిత్రంతో మాత్రమే. కానీ ఆమె కోట్లాది రూపాయలు భారీ బంగ్లా సొంతం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ నెటిజన్లు అంటున్నారు.
అది కూడా షారుఖ్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రేఖ లాంటి సెలెబ్రిటీలు నివాసం ఉండే ప్రాంతంలో తృప్తి డిమ్రి కొత్త ఇల్లు కొనుగోలు చేసిందట. ఏకంగా 14 కోట్ల రూపాయలతో యానిమల్ బ్యూటీ ఈ ఇంటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తృప్తి డిమ్రి స్టాంప్ డ్యూటీ కోసం 70 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం 30 వేలు చెల్లించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తృప్తి డిమ్రి భూల్ భూలయా 3 లో నటిస్తోంది. యానిమల్ చిత్రం తర్వాత ఆమెకి అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి.
