టాలీవుడ్ లోనూ తన మార్క్ చూపించిన సింగర్, కంపోజర్ బప్పి లహిరి (Bappi Lahiri) మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా నివాళి అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, దర్శకుడు కే రాఘవేంద్రరావు చింతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికన ఆయనకు ఘన నివాళి అర్పించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్ బప్పి లహిరి (Bappi Lahiri) మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు. 69 ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి చెందడం పట్ల సినీ ప్రముఖులు బాధపడుతున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో పాటలను కంపోజ్ చేసి.. పాడి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు బప్పి లహిరి. ఆయన మరణం పట్ల మెగా స్టార్ చిరంజీవి ( Megastar Chiranjivi), డైలాగ్ కింగ్ మోహన్ బాబు ( Mohan Babu) సోషల్ మీడియా వేదికన ఘన నివాళి అర్పించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ( Ram Nath Kovind) కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోషల్ మీడియాలో నివాళి అర్పించారు. ‘సాటిలేని గాయకుడు-స్వరకర్త శ్రీ బప్పి లహిరి. అతని పాటలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రజాదరణ పొందాయి. అతని వైవిధ్యమైన శ్రేణిలో యూత్ కు సంబంధించిన మరియు మనోహరమైన మెలోడీలు ఉన్నాయి. ఆయన చిరస్మరణీయమైన పాటలు చాలా కాలం పాటు లిసనర్స్ ను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ పేర్కొన్నాడు. బప్పీ తెలుగులో గ్యాంగ్ లీడర్ స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్ బాస్ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, ‘ప్రముఖ సంగీ దర్శకుడు మరియు గాయకుడు బప్పి లహిరి మరణ వార్తతో తీవ్ర వేదనకు గురయ్యా. బప్పీతో నాకు మంచి అనుబంధం ఉంది. తను నాకోసం అనేక చార్ట్ బస్టర్లను అందించాడు. ఆయన పాటలు నా సినిమాల ప్రజాదరణకు ఎంతో దోహదపడ్డాయి. అతని ప్రత్యేక శైలి, అతని సంగీతం ఎప్పుడూ గుర్తుంటాయి. బప్పీ కుటుంబికులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ భావోద్వేగభరితంగా ట్వీట్ చేశాడు. బప్పీతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా నివాళి అర్పించారు. ‘భారతదేశపు లెజెండరీ సంగీత స్వరకర్తలలో ఒకరైన శ్రీ బప్పి లహిరి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన మూడు తెలుగు సూపర్ హిట్ సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశాను. అతనితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన కుటుంబానికి ఇలాంటి సమయంలో దేవుడు ధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.’ అని పేర్కొన్నాడు. అదే విధంగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు కూడా బప్పీ లహిరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
