Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్.. ‘18 పేజెస్’ నుంచి ట్రైలర్ సిద్ధం.. రిలీజ్ ఎప్పుడంటే?

నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ మరోసారి జంటగా అలరించబోతున్న చిత్రం ‘18 పేజెస్’(18 Pages). ఇప్పటికే క్రేజీ అప్డేట్స్ అందుతుండగా.. ట్రైలర్ విడుదలపై మేకర్స్ తాజాగా అనౌన్స్ మెంట్ అందించారు. 
 

Trailer Announcement from 18 Pages movie!
Author
First Published Dec 15, 2022, 7:51 PM IST

యంగ్ హీరోహీరోయిన్ నిఖిల్ (Nikhil) - అనుపమా పరమేశ్వరన్ (Anupama) మరోసారి జంటగా అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. రొమాంటిక్ డ్రామా రూపుదిద్దుకున్న ‘18 పేజెస్’(18 Pages)లో కలిసి నటించారు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.  

ఇటీవలే ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ ‘18పేజిస్’ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండటంతో చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు మేకర్స్. తాజాగా ట్రైలర్ ను సిద్ధం చేసినట్టు అప్డేట్ అందించారు. 

ఇటీవలే ‘18పేజెస్’ టీజర్ కి, ‘నన్నయ్య రాసిన’, అటాగే ‘టైం ఇవ్వు పిల్ల’ అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన ‘ఏడు రంగుల వాన’ అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.  ప్రమోషన్స్ లో భాగంగా ఒక క్రేజీ వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న థియేలర్లలో రిలీజ్ కాబోతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios