పవన్‌ కళ్యాణ్‌, నదియాల మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. తన మేనత్తతో పవన్‌ చెప్పే డైలాగ్‌లు ఆడియెన్స్ హృదయాలను పిండేశాయి. ఇప్పుడు ఇదే సన్నివేశాలను ట్రాఫిక్‌కి అన్వహించారు. హెల్మెట్‌ ధరించాలని చెప్పేందుకు మహేష్‌ని వాడుకున్న తెలంగాణ పోలీసులు ఇప్పుడు పవన్‌ని కూడా వాడేసుకున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం `అత్తారింటికి దారేది`. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి లీక్‌ అయినా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌, నదియాల మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. తన మేనత్తతో పవన్‌ చెప్పే డైలాగ్‌లు ఆడియెన్స్ హృదయాలను పిండేశాయి. ఇప్పుడు ఇదే సన్నివేశాలను ట్రాఫిక్‌కి అన్వహించారు. హెల్మెట్‌ ధరించాలని చెప్పేందుకు మహేష్‌ని వాడుకున్నారు తెలంగాణ పోలీసులు. ఆ మధ్య బాలయ్య డైలాగ్‌లను, సీన్లని వాడుకున్నారు. ఇప్పుడు పవన్‌ని కూడా వాడుకోబోతున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `అత్తారింటికి దారేది` చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ ని ట్రాఫిక్స్ రూల్స్ కి జోడిస్తూ మీమ్స్ చేశారు. దాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఇందులో బైక్‌లో బైక్‌పై వెళ్తున్న వారిని ఛలానా ఎంత పడిందో చూపించారు. త్రిబుల్‌ రైడింగ్‌, వెహికల్‌ సమాచారం దాచడం, హెల్మెట్‌ లేకపోవడం, రాష్‌ డ్రైవింగ్‌, నెంబర్‌ ప్లేట్‌ని కానరాకుండా కాలు పెట్టడం వంటి వారికి కలిపి 2800 ఫైన్‌ వేశారు. దానికి పక్కన పవన్‌ కళ్యాణ్ సినిమా సీన్స్ జోడించారు. 

Scroll to load tweet…

ఇందులో `అత్తారింటికి దారేది` సినిమాలోని రైల్వే సీన్ నేపథ్యంలో `నువ్వేమో రూ.1300 కాపాడదాం అని కాలు పెట్టావ్... కానీ నువ్వు చేసిన ఈ పనికి ఇంకో రూ.1500 ఎక్కువ పడ్డాయి` అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ట్రాఫిక్‌ పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.