రేవంత్ రెడ్డి ఇంటికి సెలెబ్రిటీల తాకిడి మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాతగా చలామణి అవుతున్న ఒకరు నేడు రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం రాష్ట్రం మొత్తం ఆ మాటకొస్తే దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మూడవసారి కేసీఆర్ సీఎం పీఠం దక్కించుకుంటారా ? బీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ? ఇలా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఈ సారి అధికారం మారడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడం ఖాయం అంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మరి అసలు ఫలితాలు ఏంటో మరో 24 గంటల్లో తేలిపోనుంది. అయితే సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతుండడంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు కూడా వస్తున్నాయి.
ఎవరు అధికారంలోకి వస్తే వారిని బుజ్జగించడం, మర్యాదగా పలకరించడం సెలెబ్రిటీలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటికి సెలెబ్రిటీల తాకిడి మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: సలార్ ట్రైలర్ లో ఇవి గమనించారా, కేజీఎఫ్ తో పెట్టిన లింకులు ఇవే..
టాలీవుడ్ అగ్ర నిర్మాతగా చలామణి అవుతున్న ఒకరు నేడు రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ముందస్తుగానే ఆయనకి శుభాకాంక్షలు చెప్పారట. ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారట. ఆ నిర్మాత ఎవరనే వివరాలు మాత్రం బయటకి రాలేదు.
