ఈ సినిమాను బయిట అందరు చెప్పుకుంటున్నట్లు కేవలం  మైత్రీ మూవీ మేక‌ర్స్  మాత్రమే నిర్మించ‌బోవటం లేదు. మరో రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లు నిర్మించనున్నారు. 


పఠాన్ తో సాలిడ్ హిట్ కొట్టిన బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. పాన్ ఇండియ‌న్ స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను ఎవరు నిర్మించనున్నారు. అంత బడ్జెట్ ఎవరు భరించనున్నారు అనే విషయమై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను బయిట అందరు చెప్పుకుంటున్నట్లు కేవలం మైత్రీ మూవీ మేక‌ర్స్ మాత్రమే నిర్మించ‌బోవటం లేదు. మరో రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లు నిర్మించనున్నారు. వివరాల్లోకి వెళితే...

హిట్ అనేది లేక గత కొంతకాలంగా బాలీవుడ్ పూర్తి స్దాయి నిరాశలో ఉంది. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది.వారం రోజుల్లోనే 700 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకు వచ్చారు.ఇందుకు కారణం ఈ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. షారుఖ్ ఐదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి కారణం ఈ బాలీవుడ్ స్టార్ డైరక్టరే. సిద్దార్ద్ ఆనంద్..తొలి నుంచి యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఈ నేపధ్యంలో పఠాన్ వంటి సూపర్ హిట్ తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అంచనాలు భారీగా పెరిగుతాయనటంలో సందేహం లేదు.

మరి సిద్ధార్థ్ ఆనంద్ ప్రెజెంట్ హృతిక్ రోషన్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత ప్రభాస్ తో భారీ సినిమాను ప్లాన్ చేసారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అని మైత్రి మూవీస్ అధినేతలు క్లారిటీ ఇచ్చారు.అయితే ఈ సినిమా నిర్మాణంలో మైత్రీ మూవీస్ తో పాటు యువీ క్రియేషన్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ వారు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం.ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి ఇంత భారీ బడ్జెట్ సినిమా రానుందనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాలుగు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.

కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో స‌లార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడు. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌తో సూప‌ర్ హీరో క‌థాంశంతో ప్ర‌భాస్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే షూటింగ్ ద‌శ‌లో ఉంది. వీటితో పాటు ద‌ర్శ‌కుడు మారుతి - ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న‌ది.