టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది మైత్రి మూవీస్. 'సవ్యసాచి' సినిమా తప్ప ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్లే.. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను రూపొందిస్తున్నారు. 

చాలా మంది హీరోలకు, దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రి మూవీస్. ఒకేసారి నాలుగైదు సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీస్ ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాను మూడు భాషల్లో చిత్రీకరిస్తారని సమాచారం. బాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఆ దర్శకుడు సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మైత్రి మూవీస్ కి బాలీవుడ్ లో ఎలాంటి  గుర్తింపు లభిస్తుందో చూడాలి!