Bigg Boss Telugu 7: ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్‌ షాక్‌.. టాప్‌ కంటెస్టెంట్‌ ఔట్‌?

`బిగ్‌ బాస్‌ తెలుగు 7` షోలో ఈ సారి ఎలిమినేషన్ల ప్రక్రియ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ వారం టాప్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది.

top and strong contestant out from bigg boss telugu 7 house this week arj

బిగ్‌ బాస్‌ తెలుగు 7 రియాలిటీ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఉల్టాపుల్టా అన్నట్టుగానే ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ కావడం, మధ్యలో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం, రతిక రీ ఎంట్రీ ఇవ్వడం వంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలు జరిగాయి. దీంతో షోపై ఆసక్తి ఏర్పడుతుంది. అయితే ఎలిమినేషన్ల ప్రక్రియ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సీజన్‌లో మొదటి రెండు కిరణ్‌ రాథోర్‌, షకీలా ఎలిమినేట్‌ కావడం ఊహించిందే, ఆడియెన్స్ యాక్సెప్ట్ చేశారు. 

కానీ ఆ తర్వాత జరిగిన ఎలిమినేషన్‌ని ఎవరూ ఊహించలేదు. వెళ్లిపోతారు అనుకునే వాళ్లు హౌజ్‌లో ఉన్నారు, కొత్త వారు వెళ్లిపోయారు. యామిని, రతిక, శుభ శ్రీల విషయంలో అదే జరిగింది. ఇక ఇప్పుడు ఏడో వారంలోనూ అలాంటిదే చోటు చేసుకోబోతుందట. ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఓ లీక్‌ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ సారి టాప్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు.. ఈ వారం బిగ్‌ బాస్‌ నుంచి టాప్‌ కంటెస్టెంట్ గా భావించే, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా భావించే సందీప్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అవుతున్నారని తెలుస్తుంది. భోలే, ప్రియాంక, అశ్విని, అమర్‌ దీప్‌ లాంటి కంటెస్టెంట్‌ వీక్‌గా ఉన్నారని, వీరిలో ఎవరో ఒకరు వెళ్లే అవకాశం ఉందని భావించారు. ప్రధానంగా టేస్టీ తేజ పేరు వినిపిస్తూ వచ్చింది. కానీ అనూహ్యంగా సందీప్‌ మాస్టర్ హౌజ్‌ని వీడాడనే వార్త ఆశ్చర్యపరుస్తుంది. 

top and strong contestant out from bigg boss telugu 7 house this week arj

మొదట్లో చాలా యాక్టివ్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్న సందీప్‌ మాస్టర్‌ ఇటీవల రెండు మూడు వారాల్లో కాస్త డల్‌ అయ్యారు. గేమ్స్ లోనూ ఆయన జోరు తగ్గింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలిమినేట్‌ కాబోతున్నాడనే వార్త మాత్రం అందరిని షాక్‌కి గురి చేస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. ఇక వీకెండ్‌ కావడంతో ఈ రోజు హోస్ట్ నాగార్జున రాబోతున్నారు. హౌజ్‌లో ఈవారం కంటెస్టెంట్లు చేసిన తప్పులను, అలాగే అభినందనలు తెలియజేయనున్నారు. ఈ వారం గౌతమ్‌ కెప్టెన్‌గా గెలిచిన విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios