హలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్ 7'. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూలై 12న రిలీజ్ అయ్యింది.  

మిషన్ ఇంపాజిబుల్’(MI) సినిమా సీరిస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజి క్రేజ్ ఉందో ... ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరో టాక్ క్రూజ్ చేసే విన్యాసాలు ఒళ్లుగగూర్పాటుకు గురిచేస్తాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే MI సినిమాకు ఏడో సీరిస్ ఈ రోజే  విడుదల అయ్యింది. ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్- పార్ట్ వన్’గా ఈ సినిమా థియేటర్లోకు వచ్చేసింది.   

మనదేశంలో ఈ మూవీని  ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదల చేసారు.   హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్ కీలకపాత్రల్లో నటించిన  ఈ సినిమా భారత్ లో దాదాపు 2 వేల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను రెండు వారాల ముందే ప్రారంభించారు. టికెట్ అమ్మకాలు కూడా బాగానే జరిగాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే చాలా మంది ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఎప్పుడనేది  చెక్ చేస్తున్నారు.

అందుతున్న మీడియా సమాచారం మేరకు ... MI7 యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన అయితే అఫీషియల్ గా లేదు. అయితే ఈ చిత్రాన్ని మార్చి 2024లో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీలోకి రావాలంటే దాదాపు 8-9 నెలల సమయం పడుతుందని చెప్తున్నారు. మరో ప్రక్క ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను పొందేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ పోటీపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
 
ఇక ఈ సినిమాలో 59 ఏళ్ల వయస్సులోనూ టామ్ క్రూజ్.. కుర్రాడిలా స్టంట్స్ చేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నారు. రీసెంట్ గా ‘టాప్‌గన్’ మూవీలో యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసిన టామ్.. ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్‌’లో కూడా అదిరిపోయే యాక్షన్ సీన్స్‌లో నటించాడు.  టామ్ క్రూజ్.. ఈసారి కూడా మెస్మరైజ్ చేసి, తన విన్యాశాలతో ఈలలు వేయిస్తున్నాడని టాక్