టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ అసలు పేరు ఇది కాదా..? ఆయన పేరు ఇంకొకటి ఉందా..? సినిమాల్లో కలిసి వచ్చిందని.. ఈ పేరును స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నాడా..? ఇంతకీ అసలు కథ ఏంటి..? 

 మాస్ దా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కాగా మరొకటి గామి. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో కనిపించబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు సందడి చేయబోతున్నారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం యువ హీరోలలో దూసుకుపోతున్నాడు. వరుసగా కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

తాజాగా విశ్వక్ సేన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలని తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో తన అసలు పేరు విశ్వక్ సేన్ కాదని సినిమాల్లోకి వచ్చిన తర్వాతే మార్చుకున్నాను అని తెలిపాడు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లోకి వచ్చాక ఏం కలిసి రావట్లేదు, అప్పటికే హీరోగా తీసిన వెళ్ళిపోమాకే సినిమా తీసి సంవత్సరం పైనే అవుతున్నా రిలీజ్ అవ్వట్లేదు. ఆడిషన్స్ ఇస్తున్నా సెలెక్ట్ అవ్వట్లేదు. మా నాన్న నా పేరు మార్చారు. దినేష్ నాయుడు నుంచి విశ్వక్ సేన్ అని మార్చారు అని అన్నారు.

ఇక పేరు మార్చుకున్న రెండు వారాలకే ప్రభావం చూపించిందని.. అప్పటి వరకూ ఆగిపోయి ఉన్న వెళ్ళిపోమాకే సినిమా రిలీజ్ అయింది. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఫలక్ నామా దాస్ ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టాం. ఈ జాతకాలు, ఆస్ట్రాలజీ నమ్మకపోయినా వాటికి రెస్పెక్ట్ మాత్రం ఇస్తాను అని తెలిపాడు. ఇలా దినేష్ నాయుడుగా ఉన్న ఈయంగ్ హీరో పేరు విశ్వక్ సేన్ గామారింది.