హిట్టు.. ప్లాపు మధ్య కొట్టుకుంటూ.. సాగుతోంది యంగ్ హీరో నితిన్ మూవీ కెరీర్ . వరుస సినిమాలు చేస్తున్నా.. అందులో వర్కౌట్ అవుతున్నవి మాత్రం తక్కువే. అందుకేతాజాగా ఓ ప్రయోగం చేయబోతున్నాడట నితిన్.
యంగ్ హీరో నితిన్ కు ఎందుకో టైమ్ కలిసి రావడం లేదు. ప్రస్తుతం వరు సగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న నితిన్.. సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నలబై ఏళ్ళు వచ్చినా.. ఇంకా స్లీమ్ గా ఉండే ఈ హీరో.. ప్రస్తుతం డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది.ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో .. ఈమూవీ తరువాత నితిన్ తనకు సూపర్ హిట్ అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
వెంకీ కుడుములతో సినిమాకు సబంధించిన ఇప్పికే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రిసెట్టింగ్ అప్డ్ డేట్ బయటకువచ్చింది. నితిన్ ఈసినిమా కోసం ఓ ఇరవై ఏళ్లు వయస్సు తగ్గబోతున్నాడట. అవును నిజమే.. ఇప్పటికే స్లిమ్ గా ఓ ముప్పై ఏళ్ల హీరోలా ఉండే నితిన్.. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి.. 21 ఏళ్ళ కుర్రాడిలా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
వెంకీ కుడుముల సినిమాలో సాలిడ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందట. ఈ సినిమా ప్లాష్‌బ్యాక్‌లో నితిన్ 21 ఏళ్ల యువకుడిగా కనిపిస్తారట. ఇందుకోసం ప్రత్యేకమైన వీఎఫ్‌ఎక్స్ సహాయంతో నితిన్ లుక్‌ను సహజంగా చూపించబోతున్నారని తెలిసింది. ఈ ఎపిసోడ్ కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ చేసిన భీష్మ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దాంతో ఈసారి వచ్చే సినిమా ఎలా ఉంటుందో.. చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.
అరుదైన వ్యాధి వల్ల నెలరోజుల్లో చనిపోతానని తెలిసిన ఒక అబ్బాయి.. ఆ నెల రోజులు తన జీవితాన్ని ఎలా గడిపాడు అనేది ఈసినిమా స్టోరీగా తెలుస్తోంది. అయితే ఈసినిమాలో తన లైఫ్ ఎండ్ కార్డ్ ఎలా ఉంటుంది అనేది క్లైమాక్స్ అని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. వెకీ కుడుముల చిరంజీవితో సినిమా చేయాల్సి ఉంది. ఈ విషయంలో అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాని కొన్నికారణాలవల్ల ఈప్రాజెక్ట్స్ కాన్సిల్ అయినట్టుతెలుస్తోంది.
