టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) అందరికి షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు బ్యాచిలర్ అనుకుని పొరపడుతున్న ఆడియన్స్ కు తాను మ్యారీడ్ అంటూ సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ నవీన్ చంద్ర పెళ్లి చేసుకున్నది ఎప్పుడు..? ఎవరినీ..?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) అందరికి షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు బ్యాచిలర్ అనుకుని పొరపడుతున్న ఆడియన్స్ కు తాను మ్యారీడ్ అంటూ సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ నవీన్ చంద్ర పెళ్లి చేసుకున్నది ఎప్పుడు..? ఎవరినీ..?

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర(Naveen Chandra).. ఆతరువాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర.. వెబ్ సిరీస్ లతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. రీసెంట్ గా పరంపర వెబ్‌సిరీస్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం అరవింద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం నవీన్‌ చంద్ర(Naveen Chandra) పెళ్లికి సంబంధించిన ఓ విషయం ఇండస్ట్రీలో అందరికి షాక్ ఇచ్చింది. ఇంతవరకు తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు నవీన్. యంగ్ స్టార్ కు లేడీ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే ఇంత వరకూ తాను బ్యాచిలర్ అనే అనుకున్నారు అంతా.. కాని తాను బ్యాచిలర్ కాదు అని సడెన్ గా షాక్ ఇచ్చాడు నవీన్ చంద్ర(Naveen Chandra). తనకు పెళ్ళయ్యిందని ప్రకటించాడు.

 సరిగ్గా ముహూర్తం చూసుకుని తాజాగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చాడు నవీన్(Naveen Chandra). ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్‌ డే వైఫీ. నా బెటర్‌ హాఫ్‌ ఓర్మా అంటూ.. తన భార్య పేరుతో సహా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్‌చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

View post on Instagram

ఇంత కామ్ గా గా బుద్దిమంతుడిలా ఉండే నవీన్‌ చంద్ర(Naveen Chandra)కు పెళ్లి ఎప్పుడు అయ్యింది..? అసలు ఇన్ని రోజులు ఎందకు చెప్పకుండా దాచాడు అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. సెలబ్రెటీలు కొన్ని విషయాలు అస్సలు దాచలేరు. ముఖ్యంగా వారి పెళ్లి విషయం ఎలాగైనా బయటకు వస్తుంది. అటువంటిది చడీ చప్పుడు లేకుండా ఈ యంగ్ హీరో.. ఎప్పుడు పెళ్ళి చేసుకున్నాడు అంటూ తెగ ఆశ్చర్య పోతున్నారు ఫ్యాన్స్. ఇక నవీన్ జంట బాగుందంటూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.