Asianet News TeluguAsianet News Telugu

గాయపడ్డ అఖిల్.. చేతికి పెద్ద కట్టుతో అక్కినేని హీరో.. ఏమయ్యింది..?

అఖిల్ అక్కినేనికి ఏమయ్యింది.. చేతికి పెద్ద కట్టుతో కనిపించిన అఖిల్ ను చూసి అక్కినేని అభిమానులు కలవరపడుతున్నారు. ఆయనకు ఏమైందంటూ.. ఆరాతీస్తున్నారు. 

Tollywood Young Hero Akhil Akkineni Hand Injured Viral Photo JMS
Author
First Published Jan 16, 2024, 10:57 PM IST

పాపం అఖిల్.. ఎంత ప్రయత్నించినా.. హిట్ మాత్రం పడటంలేదు.. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు అఖిల్. కాని ఎంత ప్రయత్నించినా ఏం లాభం లేకుండా పోయింది. తండ్రి స్టార్ డమ్ కూడా అఖిల్ కు ఏమాత్రం ఉపయోగపడటంలేదు. అంతే కాదు  అక్కినేని యంగ్ హీరో  హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. సినిమా సినిమాకు చేంజ్ అవుతున్నాడు.. బాడీ బిల్డప్ చేయడమే కాదు.. సబ్జెక్ట్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుంటున్నాడు. 

 చేసిన సినిమాలన్నీ నిరాశపరచడంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమా పై దృష్టిపెట్టాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొడతానన్న నమ్మకంతో ఉన్నాడు. అయితే ఈమధ్య  అఖిల్ చేతికి పెద్ద కట్టుతో కనిపించాడు. అది కూడాచిన్న కట్టు కాదు.. చాలా పెద్ద కట్టుతో కనిపించి  షాక్ ఇచ్చాడు. ఆ కట్టు చూస్తుంటే.. అఖిల్ కు పెద్ద గాయమే అయ్యిందని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా  అఖిల్ సలార్ మూవీ సక్సెస్ పార్టీలో కనిపించాడు. ఈ సక్సెస్ పార్టీ బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు అక్కినేని అఖిల్ హాజరయ్యాడు.

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసి నరికార్డ క్రియేట్ చేసింది సలార్. అయితే  అఖిల్ తన నెక్ట్స్ సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. తన ఫస్ట్ మూవీ అఖిల్, ఆతరువాత హలో.. ఆతరువాత మిస్టర్ మజ్నూ.. ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ చూసిన అక్కినేని హీరోకు..ఒక్క సినిమా పర్వాలేదు అనిపించింది. 

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో పాటు.. అఖిల్ కెరీర్ లోనే  బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఏజెంట్. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ యువి క్రియేషన్స్  బ్యానర్ లో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఎటువంటటి ఆర్బాటం లేకుండా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లోనే అఖిల్ గాయపడి ఉండొచ్చు అంటున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios