ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్చలు, సమస్యల పరిష్కారానికి పరిష్కారాల కనుగొనేవరకు వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. సినిమాల థియేటరిక్ వసూళ్లు తక్కువ స్థాయికి పడిపోవడం.. ప్రొడక్షన్ ఖర్చులు విపరీతంగా పెరిగడంతో.. పరిశ్రమను పునర్నిర్మించే ప్రయత్నంలో నిర్మాతల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలనే నిర్ణయం పలు అగ్ర హీరోల చిత్రాలపై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. షూటింగ్‌ల బంద్ నిర్ణయంపై అగ్ర హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో చర్చలు జరిపారు. అయితే వీరు ముగ్గురు కూడా రెమ్యూనరేషన్‌ తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు. సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో భాగంగా రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటామన్న ఆ హీరోలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, త్వరలోనే మిగతా హీరోలతో కూడా చర్చలు జరుపుతామని నిర్మాతలు చెబుతున్నారు.