Asianet News TeluguAsianet News Telugu

Singer Kausalya: సింగర్ కౌసల్య పేరుతో మోసం, అప్రమత్తం చేసిన టాలీవుడ్ గాయని..

సోషల్ మీడియా వల్ల ఎంత మేలు జరుగుతుందో.. అంతే కీడు కూడా జరుగుతుంది.ముఖ్యంగా సెలబ్రిటీల ఇమేజ్ పెరిగేది సోషల్ మీడియా వల్లే.. వాళ్ల ఇమేజ్ డ్యామేజ్ అయ్యేది కూడా ఈ సోషల్ మీడియా వల్లే. తాజాగా టాలీవుడ్ సింగర్ కౌసల్యకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. 

Tollywood singer kausalya reacts on her fake accounts And post JMS
Author
First Published Dec 4, 2023, 11:12 AM IST

సోషల్ మీడియా..  వల్ల ఎంత ఉపమోగం ఉందో.. అందే ప్రమాదం కూడా ఉంది. పెరుగుతున్న టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో అంతే ప్రమాదకరంగా కూడా మారిపోతోంది.  రోజురోజుకు పెరిగిపోతున్న సోషల్ మీడియా టెన్నాలజీవల్ల అదే రేంజ్ లో మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఇది ఉపయోగకరంగా ఉన్నా.. అంతే డామేజ్ కూడా చేస్తోంది. 

 ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలను హ్యాక్ చేయడమే కాకుండా.. ఫేక్ అకౌంట్లను సృష్టిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య వాట్సాప్ లోనూ ఇలాంటి తరహా మోసాలు జరుగుతూ ఉన్నాయి. వాట్సాప్ లో ఫేక్ డీపీలు, ఫేక్ నంబర్లతో ప్రజలతో పాటు సెలబ్రిటీలనూ బురిడీ కొట్టిస్తున్నారు మోసగాళ్లు.  రీసెంట్ గా రష్మిక, కత్రీనా, ఆలియా ల డీప్ ఫేక్ ఫోటోలు చూశాం కదా.. ఇక తన పేరుతో ఓ ఆకతాయి చేస్తున్న మోసాన్ని వెల్లడించడంతో పాటు..అడ్డుకునే ప్రయత్నం చేశారు టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్య.

 

తాజాగా సోషల్ మీడియాలో  ఓ పోస్ట్ ను షేర్ చేసింది కౌసల్య. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు..సోషల్ మీడియాలో కొంత మంది తన పేరు, నంబర్ అంటూ ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. అది నా నంబర్ కాదు.. నా అకౌంట్ కాదు. ఎవరో నా ఫొటో డీపీ పెట్టుకుని, చాట్ చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి” అని తన ఫాలోవర్లకు సూచించింది. ఇక ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన ఫాలోవర్లు ఇలాంటి వారితో చాటింగ్ లు కానీ, డబ్బులు పంపడం కానీ చేయెద్దని పేర్కొంది. కాగా.. గతంలోనూ ఓసారి కౌసల్యకు ఇదే సమస్య ఎదురైంది. ఈ విషయంపై వెంటనే స్పందించి.. ఆ మోసాలను బయటి ప్రపంచానికి చెప్పి.. ఫాలోవర్లను అప్రమత్తం చేసింది.

ఇక ప్రస్తుతం సింగర్ కౌసల్య యాక్టీవ్ గా లేదు.. ఒకప్పుడు  టాలీవుడ్ లో వరుస పాటలు పాడి.. స్టార్ సింగర్ గా వెలుగొందారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి టీమ్ లో మెయిన్ సింగర్ గా ఉన్న ఆమె.. ఆయన ప్రతీ సినిమాలో ఖచ్చితంగా రెండు పాటలకు పైగానే పాడేవారు. ఇండస్ట్రీలో తన మార్క్ చూపించిన  కౌసల్య.. ఆతరువాత డల్ అయ్యారు. ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావడం.. ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఇచ్చే చక్రీ మరణించడంతో .. కౌసల్యకు అవకాశాలు లేక  వెనకబడిపోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios