నటుడు సుమన్ పొలిటికల్ ఎంట్రీ..? ఏపార్టీలో చేరుతున్నారంటే..?
టాలీవుడ్ సీనియర్ హీరో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుమన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
టాలీవుడ్ లో హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. రకరకాల పాత్రలను అవలీలగా పోషించాడు సుమన్. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేశాడు సుమన్. తెలుగులో ఎక్కువ సినిమాలు చేశాడు. అంతే కాదు ఆమధ్య పాలిటిక్స్ లో కూడా చేరిన సుమన్ పోటీ చేయడానికి టికెట్ ను సాధించలేకపోయాడు. గతంలో ఆయన టీడీపీలో పనిచేశారు. తరువాత పార్టీలో పెద్దగా యాక్టీవ్ గా లేరు. కాని తాజాగా మరోసారి సుమర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతే కాదు ఈసారి సుమన్ ఎలక్షన్స్ లో పోటీ చేయడం కూడా ఖాయం అంటున్నారు. అయితే సుమన్ ఏపార్టీలో చేరబోతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే.. సుమన్ త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ లో చేరడంతో పాటు.. రాజమండ్రి నుంచి ఆయన పోటీ చేస్తారు అని టాక్. అయితే అత్యంత కీలకమై స్థానం అయిన రాజమండ్రి నుంచి సుమన్ ను జగన్ నిజంగా పోటీకి దింపుతారా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సుమన్ కంటే ముందు నుంచి వైసీపీలో చాలామంది సినిమా తారలు ఉన్నారు. ముఖ్యంగా అలీ లాంటి స్టార్ నటులు వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అలీది కూడా రాజమండ్రి కావడం.. అలీ రాజమండ్రి టికెట్ ను ఆశిస్తుండటంతో.. అతన్ని కాదని సుమన్ కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అంటున్నారు. అసలు సుమన్ నిజంగా వైసీపీలో చేరతారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కొంత కాలంగా రాజమండ్రి నుంచి అలీని.. కర్నూలు నుంచి స్టార్ డైరెక్టర్ వినాయక్ ను పోటీకి దింపుతారని వార్తలు వస్తున్నాయి. కాని అలీని రాజ్య సభకు పంపుతారన్న టాక్ కూడా వనిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.
ఇక సుమన్ వైసీపీలోనే చరతారు అన్న గ్యారంటీ లేదు. చేరినా టికెట్ వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. ఇప్పటికే సర్వేల ప్రకారం జగన్ సీనియర్ సిట్టింగ్ లకే హ్యాండ్ ఇస్తూ వెళ్తున్నాడు. ఈక్రమంలో సుమన్ కు టికెట్ దక్కుతుంది అన్న నమ్మకం లేదు. ఇక ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ ఆగాల్సిందే.