Asianet News TeluguAsianet News Telugu

నటుడు సాయాజీ షిండే కు గుండెపోటు.. హెల్త్ అప్ డేట్ ఏంటంటే....?

ప్రముఖ సీనియర్ నటుడు సాయాజీ షిండే హాస్పిటల్ లో చేరారు. తీవ్రమైన ఛాతి నొప్పికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటా హుటిన హాస్పిటల్ కు తరలించారు. 

 Tollywood Senior Actor  Sayaji Shinde Hospitalized with Heart Attack JMS
Author
First Published Apr 12, 2024, 5:27 PM IST

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన  ఛాతీనొప్పి రావడంతో వెంటనే గుర్తించిన  కుటుంబ సభ్యులు ఆయన్ని గురువారం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండెలో కొన్ని బ్లాక్స్‌ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు యాంజియోప్లాస్టీ  చేసినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం సాయాజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర సతారా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మహారాష్ట్రకు చెందినసాయాజీ.. తెలుగు సినిమాల ద్వారా స్టార్ గా ఎదిగారు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన ఆయనకు ఈమధ్య కాలంలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 

అడపా దడపా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న సాయాజీ.. అటు బాలీవుడ్ తో పాటు మరాఠి సినిమాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు సాయాజీ. సాయాజీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రొటీన్‌ చెకప్‌లో భాగంగా ఇటీవలే పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అప్పుడు ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించామని, గుండెలో కుడివైపు సిరలు 99 శాతం మేర పూర్తిగా మూసుకుపోయినట్లు తెలిపారు. 

ఇక లేట్ చేయకుండా.. నిపుణుల సమక్షంలో సాయాజీకి  యాంజియోప్లాస్టీ చేసినట్లు వివరించారు. శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రస్తుతానికి నటుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలోనే డిశ్చార్జ్‌ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios