కరోన మహమ్మారి అన్ని రంగాలు ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇప్పటికే లాక్‌ డౌన్‌ కారణంగా వినోదరంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో మహమ్మారి ఇండస్ట్రీలోని ప్రముఖులను కబలిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లోనూ కరోన మరణాలు కలవరపెడుతుండగా తాజాగా మరో నిర్మాత కరోనాకు బలి కావటంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

ఎదురీత చిత్ర నిర్మాత బోగారి లక్ష్మీ నారాయణ ఆదివారం కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం కరోనా సోకటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించటంతో ఆయన ఆదివారం మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.