చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు చెక్ పెట్టేందుకు చాలా కాలంగా ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో అగ్ర నిర్మాత దిల్ రాజు కీలక గా వ్యవహరిస్తున్నారు.

చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు చెక్ పెట్టేందుకు చాలా కాలంగా ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో అగ్ర నిర్మాత దిల్ రాజు కీలక గా వ్యవహరిస్తున్నారు. షూటింగ్స్ బంద్ చేసి మరీ చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశాలు ఓ కొలిక్కి వచ్చాయి. 

టాలీవుడ్ నిర్మాతలంతా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టాలీవుడ్ మొత్తానికి వర్తించేలా కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. థియేటర్స్ కి జనాలు రాకపోవడం, ప్రొడక్షన్ కాస్ట్, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పెరిగిపోవడం లాంటి సమస్యల కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా రూపొందించిన కొత్త రూల్స్ నిర్మాతలకు కొంత ఊరట కలిగించేలా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. ఇక ఆర్టిస్టులు ఎవ్వరికి రోజుకు ఇంత రెమ్యునరేషన్ చెల్లించే విధానం ఉండదు. ఇప్పటి వరకు కొంతమంది ఆర్టిస్టులు ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొంటే అంత మొత్తం ఇవ్వాలని ముందే డిమాండ్ చేస్తారు. ఇక అలా ఉండదు. 

అలాగే ఆర్టిస్టుల రెమ్యునరేషన్ వేరుగా.. వారి స్టాఫ్ ఖర్చులు, హోటల్, ఫుడ్, ట్రావెల్ చార్జెస్ సపరేటుగా ఉండవు. ఇక అంతా ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ లోనే ఉంటుంది. ఈ నిబంధన స్టార్ హీరోలు, హీరోయిన్లపై ప్రభావం చూపనుంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల స్టాఫ్, ట్రావెల్ చార్జీలు, హోటల్ బిల్స్ ఇవన్నీ గతంలో నిర్మాతకు భారంగా ఉండేవి. వాళ్ళ రెమ్యునరేషన్ పరేటుగా ఉండేది. ఇక వారి ఖర్చులని నిర్మాత చూసుకోవడం ఉండదు. 

ఆర్టిస్టుల కాల్ షీట్స్, టైమింగ్ విషయంలో ఇక కఠినంగా వ్యవహరించనున్నారు. సినిమా థియేట్రికల్ రిలీజ్ పబ్లిసిటీలో ఇక పై ఓటిటి, శాటిలైట్ సంస్థలకు స్థానం లేదు. సినిమా విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటిటిలో రిలీజ్ చేయాలి. 

థియేట్రికల్, ఎగ్జిబిటర్స్, మల్టిఫ్లెక్స్ సంబంధించిన ఇతర లావాదేవిలని 3వ తేదీ ఫైనల్ చేస్తారు. టాలీవుడ్ నిర్మాతలు తీసుకున్న ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 10 నుంచి అమలు లోకి రానున్నాయి.