టాలీవుడ్ లో మరో ఫైట్ కి సమయం దగ్గరపడింది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మెగా స్టార్ ప్రతిష్టాత్మక చిత్రంతో పాటు మరో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా రూపొందించిన సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

అయితే అదే రోజు బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాల రిలీజయిన రెండు రోజుల అనంతరం గోపీచంద్ తన స్పై థ్రిల్లర్ సినిమాతో రానున్నాడు. చాణక్య సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కానుంది. 

ఫైనల్ గా ఈ ఫైట్ లో ఓంకార్ హారర్ కామెడీ స్టోరీ కూడా పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజుగారి గది 3సినిమా అక్టోబర్ 4 లేదా 5వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. దసరా సెలవులు ఉండడంతో సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఎలాంటి సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.