ఈ వారం బాక్సాఫీస్ పోరు.. బరిలో ఐదు సినిమాలు!

First Published 21, Feb 2019, 12:02 PM

కొద్దిరోజులుగా థియేటర్లలో సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇప్పుడు ఆ కొరత తీర్చడానికి ఈ శుక్రవారం నాడు మొత్తం ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. 

కొద్దిరోజులుగా థియేటర్లలో సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇప్పుడు ఆ కొరత తీర్చడానికి ఈ శుక్రవారం నాడు మొత్తం ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి!

ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ నిర్వహించలేదు. దీంతో సినిమాపై అసలు ఎలాంటి బజ్ లేకుండా పోయింది. కనీసం థియేటర్లలోకి వచ్చిన తరువాతైనా మంచి టాక్ వస్తుందేమో చూడాలి

బోల్డ్ ట్రైలర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది '4 లెటర్స్' సినిమా. కానీ అంతా కొత్తవాళ్లు కావడం, ఎట్రాక్ట్ చేసే అంశాలు లేకపోవడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లుగా కనిపించడం లేదు.

ప్రస్తుతం తెలుగులో మంచి ఫాంలో ఉన్న కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన 'మిఠాయి' సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.

నయనతార నటించిన 'ఇమైక్క నోడిగల్' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'అంజలి సి.బి.ఐ' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. దీంతో ఇదొక సినిమా రిలీజ్ అవుతుందని కూడా జనాలకు పెద్దగా తెలియదు. కోలివుడ్ లో అయితే సినిమా మంచి హిట్ అయింది. మరి తెలుగులో ఏమవుతుందో చూడాలి!

గతంలో 'ఎదురులేని మనిషి' చిత్రాన్ని తెరకెక్కించిన జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఇప్పుడు తన కొడుకు హీరోగా 'ప్రేమెంత పని చేసే నారాయణ' సినిమా తీశాడు. రేపు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో మరి!