పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, వైరల్అవుతన్న ఫోటోస్
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. స్టార్స్ వెంట వెంటనే పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటు బ్యాచిలర్లుగా ఉన్న యంగ్ హీరోలతో పాటుయంగ్ డైరెక్టర్లు కూడా పెళ్లి బంధంతో ఒక్కటి అవుతున్నారు. తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరీ వివాహా బంధంలోకి అడుగుపెట్టాడు.

నార్త్ నుంచి సౌత్ వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న స్టార్స్ అంతా.. తమ బ్రహ్మచర్యానికి స్వస్థి పలుకుతున్నారు. ఈక్రమంలో రీసెంట్ గా శర్వానంద్ ఎంగేజ్ మెంట్ తో పెళ్లికి సన్నాహాలు మొదలెట్టాడు.. అటు పలు భాషల్లో.. పలు ఇండస్ట్రీలకి చెందిన సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రణ్‌బీర్-అలియాల , నయనతార-విఘ్నేష్ శివన్, నాగ శౌర్య, హన్సిక, మంజిమా మోహన్ లాంటి చాలా మందిస్టార్స్ ఒక ఇంటివారు అయ్యారు. కాగా తాజాగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు పెళ్లి పీటలెక్కాడు.
టాలీవుడ్ యంగ్ స్టార్ .. డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్లి పీటలెక్కాడు. వివాహబంధంలోకి అడుగు పెట్టాడు. దర్శకుడిగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తోన్న వెంకీ... ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టాడు. యంగ్ దర్శకుడు వివాహా బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లికి సబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా వీరి పెళ్లికి హీరో నితిన్ తన సతీమణితో కలిసి వచ్చాడు. వీరితో పాటుగా హీరోయిన్ కీర్తిసురేష్, దర్శకుడు వెంకీ కుడుముల కూడా పెళ్లికి హాజరైయ్యారు. తాజాగా నితిన్ వీళ్లతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అంతే కాదు ఫోటో షేర్ చేయడంతో పాటు.. ఓ నోట్ కూడా రాశాడు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు వెంకీ అట్లూరికి అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.స్నేహగీతం సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ అట్లూరి. తొలి ప్రేమ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే మొస్తరు హిట్ సాధించిన ఈయంగ్ స్టార్.. వరుస సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్ను, నితిన్‌తో రంగ్‌దే సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.
ప్రస్తుతం వెంకీ కి లక్కీ ఛాన్స్ దొరికింది. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సార్ టైటిల్ తో తెరకెక్కిస్తున ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో వెంకీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందంటున్నారు సినీ జనాలు. మరిఈ సినిమా ఏమాత్రం సక్సెస్ సాధిస్తుందో చూడాలి.