ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్ని శ్రమిస్తున్నాయి. వందల సంఖ్యల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు తాను కరోనాకు మందు కనిపెట్టానని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశాడు.  టాలీవుడ్‌లో కిష్కిందకాండ, బతుకమ్మ, తుపాకి రాముడు లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు టీ ప్రభాకర్. వీటిలో రెండు చిత్రాలకు నంది అవార్డులు కూడా వచ్చాయి.

ఈ దర్శకుడు ముఖ్యమంత్రికి ఓ లేఖను రాశాడు. తన చదువు, ఇతర అర్మతలను పరిగణలోకి తీసుకోకుండా తాను తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరాడు. తాను కనిపెట్టిన సహజ సిద్ధమైన ఔషదంలో గొంతులోనే కరోనా వైరస్ నశిస్తుందని తెలిపాడు. నాలుగు నుంచి ఎనిమిది రోజుల్లో కరోనా పూర్తిగా నశిస్తుందని తెలిపాడు.

అంతేకాదు అవసరమైతే తొలి ప్రయోగం తనమీదే చేయాలని కూడా సూచించాడు ప్రభాకర్‌. కరోనాను నేరుగా తన ఊపిరితిత్తులోకి పంపినా 12 రోజుల్లోగా పూర్తి ఆరోగ్యవంతుడిని అవుతానంటూ ధీమా వ్యక్తం చేశాడు. తన మీద ప్రయోగం చేసిన తరువాత నలుగురు పేషంట్ల మీద చేసి చూడమని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. అయితే ఇప్పట్లో వ్యాక్సిన్‌ రాదంటూ చెపుతున్న ప్రపంచ దేశాల మాటలు అబద్ధాలని తాను ప్రూవ్  చేస్తానంటున్నాడు ప్రభాకర్‌.