టాలీవుడ్ లో విషాదం, దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ కన్నుమూత
ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలుముంచెత్తుతున్నాయి. అలనాటి తారలంతా ఒకరితరువాతమరొకరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శకులు ఒకరు కన్ను మూశారు.

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలుముంచెత్తుతున్నాయి. ఈరెండు మూడేళ్ళలో.. పెద్ద పెద్ద తారలు చాలా మంది కన్నుమూశారు. అలనాటి తారలంతా ఒకరితరువాతమరొకరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. మరీ ఈ రెండేళ్లలో.. కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, శరత్ బాబు తో పాటు.. దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శకులు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ కన్ను మూశారు.
ఆర్యన్ రాజేష్ హీరోగా మూవీ మొఘల్ డి.రామానాయుడు నిర్మించిన నిరీక్షణ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రాసాద్. ఆయన అసలు పేరు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్. 49 ఏళ్ల చిన్నవయస్సులో ఆయన అకాల మరణం చెందారు. డైరెక్టర్ సీతారామ్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్... శ్రీకాంత్ తో శత్రువు, నవదీప్ తో నటుడు సినిమాలను తెరకెక్కించారు. హిట్లు ప్లాన్ అనే సబంధం లేకుండా సినిమాలు చేశారు ప్రసాద్.
ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన "రెక్కి" సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేసిన సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం. ఆయన చివరి సినిమా రిలీజ్ అవ్వకముందే అకాల మరణం పొందడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు ప్రసాద్ మరణ వార్త తెలిసి సంతాపం ప్రకటిస్తున్నారు.