Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ డైరెక్టర్ బాబీకి పితృవియోగం.. సానుభూతి వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు..

టాలీవుడ్ దర్శకుడు బాబీ (Bobby)కి  పితృవియోగం కలిగింది. కాలేయ సంబంధింత సమస్యతో ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయారు. దీంతో సినీ ప్రముఖులు పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 
 

Tollywood director Bobby passes away, Film celebrities expressing sympathy
Author
First Published Aug 28, 2022, 2:08 PM IST

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ బాబీకి  ఈరోజు మధ్యాహ్నం పితృవియోగం కలిసిగింది. బాబీ పూర్తిపేరు కొల్లి సంతోష్ రవీంద్రనాథ్ కాగా.. ఈయన గుంటూరు జిల్లాకు చెందిన కొల్లి మోహన రావు (Kolli Mohana Rao)కు జన్మించారు. అయితే తాజాగా బాబీ తండ్రి అయిన మోహనరావు (69) తాజాగా తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో కాలేయ సంబంధిత వ్యాధి నివారణకు మోహన రావు చికిత్స పొందుతున్నారు. పరిస్థి విషయమించటంతో ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, బాబీ సన్నిహితులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ఈ రోజు సాయంత్ర వరకు బాడీని బాబీ సొంత గ్రామం.. ఆంధ్రప్రదేశ్ లోని  గుంటూరు జిల్లా నాగారం పాలెంకు చేర్చనున్నారు. రేపు అంత్యక క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. బాబీ 1983 ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కేఎస్ మోహన రావుకు జన్మించారు. అక్కడే బాబీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సినీ ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అనూషను పెళ్లి చేసుకున్నాడు.

మెగా స్టార్ చిరంజీవి అభిమాని అయిన బాబీ ప్రస్తుతం చిరంజీవినే డైరెక్టర్ చేస్తున్నారు. చిరంజీవి - బాబీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమవగా.. గతంలోనే  ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తర్వలోనే  టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని బాబీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తండ్రి మరణవార్త కాస్తా కలిచివేస్తోంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, ఇండస్ట్రీలోని స్నేహితులు పరామర్శిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios