నూతన తెలుగు రాష్ట్రంలో రెండవసారి ఎలక్షన్స్ కి అంతా సిద్ధమైంది. కౌంట్ డౌన్ కి సమయం కూడా ఎంతో లేదు. రిజల్ట్స్ తరువాత ఐదేళ్ల పాలనలో మార్పులు ఏ స్థాయిలో వస్తాయో గాని చాలా మంది రాజకీయ నాయకుల భవిష్యత్తు మాత్రం ఈ ఎలక్షన్స్ పై ఆధారపడి ఉన్నాయి. ఇక దేశ రాజకీయాలపై కూడా ఈ ఎలక్షన్స్ ప్రభావం చూపుతాయి.

అందుకే దేశమంతా ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ వైపే చూస్తోంది. ఇక టాలీవుడ్ సెలబ్రెటీలు ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అది ఒక పౌరుడిగా మన బాధ్యత అంటూ అభిమానులకు తెలియజేస్తున్నారు. రేపు సెలవుదినమే కావడంతో పనులన్నీ పక్కనపెట్టి ఐదేళ్ల రాష్ట్ర పాలన బావుండాలని మంచి నాయకులను ఎన్నుకోవాలని దర్శకులు సినీ నటులు ఇతర టెక్నీషియన్స్ వారి అభిమానులకు తెలియజేస్తున్నారు. 

ముఖ్యంగా ట్విట్టర్ లో ఎక్కువగా వివరిస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా కాకుండా ఇష్టమైన నాయకులను ఎంచుకోవాలని అభిమానులకు పిలుపునివ్వగా కొరటాల శివ, నితిన్, మధుర శ్రీధర్ రెడ్డి , రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, నిఖిల్, ప్రణీత సుభాష్, కమల్ కామరాజు, మంచు లక్ష్మి వంటి వారు ఓటు హక్కు గురించి తెలియజేశారు.