ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడటంతో థియేటర్లు తెరచుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుమతినివ్వడంతో జులై 30 నుంచి సినిమాల సందడి మొదలైంది. 

కరోనా తగ్గుముఖం పడుతోంది.. సినిమాల సందడి మొదలైంది. తెలంగాణ, ఆంద్రాలో థియేటర్ల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేసి గోల చేయడమే తరువాయి అన్నట్లుగా ఆనందపడ్డారు. చాలా కాలంగా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిస్‌ అవుతున్న సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడు సినిమాలు విడుదలవుతాయా? అని ఎదురుచూసారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే సినిమాలూ విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసాయి. అవేంటో వాటి రిజల్ట్ లు ఏంటో ఓసారి చూద్దాం..

తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఏ లవ్‌ స్టోరీ అనేది ఉపశీర్షిక. యస్‌.యస్‌.రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్‌.బి. చౌదరి సమర్పిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌లోనే విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌ విశేషంగా అలరించాయి. ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలో లీడ్ పెయిర్ ప్రేమ కథేంటి? వాళ్లకి ఎదురైన సంఘటన ఏమిటో తెలుసుకోవాలని జనం వెళ్లారా అంటే పెద్దగా ఆసక్తి చూపలేదనే చెప్పాలి. ఎక్కడా ఓపినింగ్స్ లేవు. ప్రమోషన్స్ కూడా కలిసి రాలేదు. జనాలకు థియోటర్స్ రావటానికి భయపడ్డారు. మొత్తంగా ఈ సినిమా డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది.

అలాగే ఎంతకైనా తెగించి సత్యాన్ని గెలిపించేందుకు సిద్ధమంటున్నాడు సత్యదేవ్‌. ‘తిమ్మరుసు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమా థియేటర్‌లో విడుదల అయ్యింది. జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌.కోనేరు నిర్మించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాదీ సేమ్ సిట్యువేషన్. హైదరాబాద్ లో కూడా ఓపినింగ్స కరువు అయ్యాయి. ఎంత మౌత్ టాక్ బాగుందని స్ప్రెడ్ అయినా జనం ధైర్యం చేయలేకపోయారు. మొత్తంగా సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తుంది.