ఈమధ్య ఎక్కువగా వివాదాలతో హైలెట్ అవుతోంది టాలీవుడ్ స్టార్ నటి ప్రగతి. ఆమె చేసే పోస్ట్ లు సోషల్ మీడియాలోహైలెట్ అవుతుంటాయి. తాజాగా ప్రగతి వీడియో ఒకటి వైరల్  అవుతోంది.  

ఈమధ్య ఎక్కువగా వివాదాలతో హైలెట్ అవుతోంది టాలీవుడ్ స్టార్ నటి ప్రగతి. ఆమె చేసే పోస్ట్ లు సోషల్ మీడియాలోహైలెట్ అవుతుంటాయి. తాజాగా ప్రగతి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 

టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ తో స్టార్డమ్ సంపాదించుకున్న నటీమణుల్లో ప్రగతి కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. తలి, అత్త పాత్రలలో ఎక్కువగా మెప్పిస్తుంది ప్రగతి. అవ్వడానికి క్యారెక్టర్ ఆర్టిస్టే కాని.. ఆమె గ్లామర్ మాత్రం హీరోయిన్లకు పోట ఇస్తూ ఉంటుంది. 

48 ఏళ్ళ వయస్సులో కూడా ఫిట్ గా బాడీని మెయింటేన్ చేస్తూ.. గ్లామర్ ను కూడా కాపాడుకుంటోంది. ప్రగతి చాలా కాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు రకరకాల వివాదాలకు కూడా కారణం అంవుతున్నారు. రీసెంట్ గా ఆమె పెళ్ళి గురించి వచ్చిన రూమర్లపై ఘాటుగా స్పందించారు ప్రగతి. తన పెళ్లి ఓ నిర్మాతల అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. ఆధారాలు లేకుండా ఇలాంటి న్యూస్ లు ఎలా రాస్తారంటూ మండిపడ్డారు. 

ఇలా నెట్టింట్లో హడావిడి చేస్తుంటారు ప్రగతి. తనకు సబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు.అయితే ప్రగతి తనపేజ్ లో శేర్ చేసే వీడియోలు.. ఫోటోలలో ఎక్కువగా జిమ్ వీడియోలు ఉంటాయి. అవే ఎక్కవగా ఆమె పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి వైరల్ అవుతుంటాయి . రెగ్యులర్ గా తాను జిమ్ లో ఏం చేస్తారు.. ఎలాంటి వర్కౌర్ట్స్ చేస్తారు అనేది ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది ప్రగతి. 

View post on Instagram

తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రగతి చీరలో జిమ్ చేస్తూ.. ఆ వీడియో పోస్ట్ చేయడం విశేషం. ప్రగతి చీర కట్టుకొని జిమ్ లో 90 కేజీల బరువు ఈజీగా మోసేసింది.దీంతో ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 90 కేజీల బరువు మోయడం, అది కూడా చీరలో ఇలా మోయడం నిజంగా గ్రేట్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రగతి రెండో పెళ్లి గురించి రూమర్స్ రాగా వాటిని సీరియస్ గా ఖండించింది.