Asianet News TeluguAsianet News Telugu

ఈరోజే ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్.. టైమ్ ఫిక్స్.. ఎన్ని గంటలకు రాబోతోంది?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ థియేట్రికల్ ట్రైలర్ ఈరోజే విడుదల కాబోతోంది. మేకర్స్ రీసెంట్ గా డేట్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ అందించగా.. తాజాగా టైమ్ కూడా అనౌన్స్ చేశారు.  
 

Time fix for Waltair Veerayya Trailer Release!
Author
First Published Jan 7, 2023, 11:43 AM IST

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వింటేజ్ లుక్ లో అలరించబోతున్నాడు. యంగ్ అండ్ మాస్ లుక్ లో తెరపై దుమ్ములేపబోతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నెని, శంకర్ నిర్మిస్తుండగా దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రుతి హాసన్ చిరు సరసన నటిస్తోంది. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

వారంలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. ఈరోజే Waltair Veerayya trailer రిలీజ్ కాబోతోంది. తాజాగా టైమ్ కూడా ఫిక్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 6:03 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. సముద్రంలో ఉవ్వెత్తున ఎగిన అలలో నాటు పడవపై చిరంజీవి ఉగ్రరూపం ట్రైలర్ పై ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ప్రస్తుతం అభిమానులు ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 8న ఈవెంట్ జరగబోతోంది. ఇక సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ కూడా బాగొచ్చిందని, సినిమాపై మేకర్స్ పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. దీంతో వరుస ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios