Asianet News TeluguAsianet News Telugu

‘టిల్లు స్వ్కేర్‌’ నైజాంలో పిచ్చ క్రేజ్, ఎంత చెప్తున్నారంటే..

 ఈ సినిమా ఫస్ట్ బిగ్ సమ్మర్ మూవీగా రిలీజ్ కానుండటంతో సినిమా బిజినెస్ రేంజ్ పెరిగి…ఏకంగా

Tillu Square Nizam pre release business details jsp
Author
First Published Mar 23, 2024, 8:24 AM IST

అప్పటిదాకా సోసోగా నడుస్తున్న సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ కెరీర్ డీజే టిల్లూ సినిమా త‌ర్వాత ఒక్క‌సారిగా మారిపోయింది. ఆ సినిమా స‌క్సెస్ ఇచ్చిన జోష్ తో దానికి సీక్వెల్ గా టిల్లూ స్వ్కేర్ తో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా పాజిటివ్ వైబ్రేష‌న్స్ ను క్రియేట్ చేస్తున్న ఈ చిత్రంలో   కంటెంట్ కింగ్ అని, అదే బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కురిపిస్తుందని నిర్మాతలు చెప్తున్నారు. టిల్లు   "డబుల్ ధమాకా" ఎంటర్‌టైనర్ టిల్లూ స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.ఈ నేపధ్యంలో చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా జరిగిందో చూద్దాం.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఈ చిత్రం ఆంధ్రా బిజినెష్ రేషియో 12 Cr అని, సీడెడ్ 3 కోట్లు అని తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఈ  సినిమాకు పిచ్చ క్రేజ్ ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత  బిజినెస్ ఆఫర్స్ రేంజ్ కూడా సాలిడ్ గా పెరిగి పోయింది . మొదట్లో సమ్మర్ లో భారీ పోటి ఉండటంతో ఈ సినిమా కి బిజినెస్ ఆఫర్స్ 6-7 కోట్ల దాకా రాగా ఇప్పుడు   పోటి తగ్గగా ఈ సినిమా ఫస్ట్ బిగ్ సమ్మర్ మూవీగా రిలీజ్ కానుండటంతో సినిమా బిజినెస్ రేంజ్ పెరిగి…ఏకంగా 9-10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉన్నాయట. మేకర్స్ 10 కోట్ల రేంజ్ బిజినెస్ ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా ఆ రేటు కన్ఫాం అయితే బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, 

మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ 32 కోట్లు దాకా అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ నెట్ ప్ల్లిక్స్ వారు 30 కోట్లు పలికిందని చెప్తున్నారు.  డీజే టిల్లూ లో హీరోయిన్ గా న‌టించిన నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించ‌డం లేదు. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మొద‌టి సినిమాలో కంటే ఈ సినిమాలో గ్లామ‌ర్ షో ఎక్కువ‌గా ఉంటుంద‌ని ట్రైల‌ర్ తోనే అర్థమైపోయింది.  

 సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి "యు/ఎ" సర్టిఫికేట్ ఇచ్చింది. 'టిల్లు స్క్వేర్' (Tillu Square) చిత్రం 'డీజే టిల్లు'ను మించిన విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. "టిల్లు" అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తన కెరీర్‌లో తొలిసారిగా "లిల్లీ" అనే బోల్డ్ క్యారెక్టర్‌ను పోషించింది. ఇప్పటికే ఆమె పాత్రకి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పుడే అందరూ "లిల్లీ" పాత్రను "రాధిక" పాత్రతో పోల్చడం ప్రారంభించారు. అయితే ఈ రెండు పాత్రలు భిన్నమైనవని, లిల్లీతో టిల్లు ప్రయాణం కూడా విభిన్నంగా ఉంటుందని, థియేటర్లలో రెట్టింపు వినోదాన్ని మరియు రెట్టింపు మజాని అందిస్తామని మేకర్స్ చెప్పారు.
 
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఈ చిత్రానికి కథనం, సంభాషణలు అందించగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా, రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరిచారు. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios