రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు. గజదొంగగా రవితేజ లుక్ అలరిస్తుంది.  


స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం పర్ఫెక్ట్ సినిమాటిక్ సబ్జెక్టు. ఆయన బయోపిక్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ వెండితెర రూపం దాల్చింది. నూతన దర్శకుడు వంశీ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది. 

నేడు టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విన్నూత్నంగా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ పై టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ లాంఛ్ చేశారు. అలాగే కాన్సెప్ట్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇతర భాషల ప్రోమోలకు కార్తీ, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్, జాన్ అబ్రహం వాయిస్రు ఓవర్ ఇవ్వడం జరిగింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ వాయిస్ తో కూడిన ప్రోమో అదిరింది. బీజీఎం అద్భుతంగా ఉంది.

Scroll to load tweet…
Scroll to load tweet…

గజదొంగగా రవితేజ లుక్ ఆకట్టుకుంది. ఆయన కళ్లల్లో ఇంటెన్సిటీ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కానుంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా... నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె కీలక రోల్ చేశారు. జీవి ప్రకాష్ సంగీతం అందించారు. 

మొత్తంగా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. రవితేజ గత చిత్రం రావణాసుర నిరాశపరిచింది. టైగర్ నాగేశ్వరావు మూవీతో ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు. ఇండియన్ రాబిన్ హుడ్ గా టైగర్ నాగేశ్వరరావుకు పేరుంది. పెద్దలను దోచి పేదలకు పంచిన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ చెలరేగడం ఖాయమనిపిస్తుంది. 

YouTube video player