బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ (Gangavva)ఇంటి ఆవరణలో పెద్ద పులి సంచరించింది. పులిని చూసిన గంగవ్వ భయంతో హడలి పోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గంగవ్వ తెలియనివారంటూ ఎవరూ ఉండరు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ బిగ్ బాస్ ఎంట్రీతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. సినిమాలలో పాత్రలు కూడా చేస్తున్న గంగవ్వ సెలెబ్రెటీగా మారిపోయారు. మై విలేజ్ షో పేరుతో యూట్యూబ్ లో విడుదలైన వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. గంగవ్వ తెలంగాణా యాక్సెంట్, ఆటిట్యూడ్, బిహేవియర్ యూట్యూబ్ ప్రేక్షకులకు మజా పంచేది. గంగవ్వ వీడియోలకు మిలియన్స్ వ్యూస్ దక్కేవి.
సోషల్ మీడియా సీలెబ్రెటీగా మారిన గంగవ్వకు బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనే అవకాశం దక్కింది. 60ఏళ్ల గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా గంగవ్వ సూపర్ హిట్. టైటిల్ కొట్టి చూపిస్తా అంటూ శబధం కూడా చేశారు. అయితే పల్లెవాతారణంలో పుట్టిపెరిగిన గంగవ్వకు హౌస్ వాతావరణం సరిపడలేదు. నాలుగు గోడల మధ్య ఏసీ గదుల్లో ఆమె ఉండలేకపోయారు. హోమ్ సిక్ కారణంగా అనారోగ్యం బారినపడ్డారు.
గంగవ్వ రిక్వెస్ట్ మేరకు బిగ్ బాస్ (Bigg boss) ఆమెను 5వ వారం హౌస్ నుండి బయటకు పంపివేశారు. అయితే మధ్యలో నిష్క్రమించినా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆమె కలను నెరవేరుస్తానని నాగార్జున (Nagarjuna) హామీ ఇచ్చారు. బిగ్ బాస్ నిర్వాహకులు, నాగార్జున చొరవతో సొంత ఊరిలో గంగవ్వ రూ. 20 లక్షల ఖర్చుతో ఇంటిని నిర్మించుకున్నారు. ఇక గంగవ్వ పాపులారిటీ ఎలా ఉందంటే ... ఈ మధ్య అనేక మంది సినిమా తారలు తమ మూవీ ప్రమోషన్స్ కోసం గంగవ్వను సంప్రదిస్తున్నారు. నాగార్జున వైల్డ్ డాగ్, నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు.
Also readSalman Khan Dance : సల్మాన్ ఖాన్ తో పోటీపడి డాన్స్ చేసిన జెనీలియా.. వైరల్ అవుతున్న వీడియో.
ఇక సోషల్ మీడియాలో కూడా గంగవ్వ సందడి మాములుగా ఉండదు. ఆమెకు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. సదరు అకౌంట్స్ లో తన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా గంగవ్వ ఇంటి ఆవరణలో పులి తిరుగుతున్న వీడియో అప్లోడ్ చేశారు. పులిని చూసి ఆమె భయానికి గురయ్యారు. అయితే ఇదంతా కేవలం మాయాజాలం మాత్రమే. సీజీ ద్వారా ఓ పులి తన ఇంట్లో తిరుగుతున్నట్లు గంగవ్వ అందరికీ భ్రమ కలిగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
