బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు వారాలలో ముగియనుంది. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులలో ఒకరు నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు. బిగ్ బాస్ నిర్వహించిన మూడు టాస్క్ లలో గెలిచిన సభ్యుడు, నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం పొందుతాడు. రేస్ టు ఫినాలే పేరుతో జరిపిన రెండు టాస్క్ లలో గెలిచి అఖిల్, సోహైల్ చివరిదైన మూడవ టాస్క్ కి చేరుకున్నారు. 

వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ఉన్న ఉయ్యాలలో కూర్చోవాలని, ఎవరైతే ఎక్కువ సేపు ఉయ్యాల దిగకుండా ఉంటారో, వారు ఫినాలే టికెట్ గెలుచుకుంటారని చెప్పడం జరిగింది. మొదటి రెండు ఫిజికల్ టాస్క్ లు కాగా, మూడవది మెంటల్ టాస్క్. అఖిల్, సోహైల్ ల సహనానికి బిగ్ బాస్ పరీక్ష పెట్టాడు. దాదాపు 24గంటల పాటు అఖిల్, సోహైల్ ఉయ్యాలలో కూర్చున్నారు. చలికి వణుకుతూ అక్కడే కూర్చున్న అఖిల్, సోహైల్ కి మొదట ఏమనిపించక పోయినా తరువాత చుక్కలు కనిపించాయి. 

గంటల తరబడి కదలకుండా ఉయ్యాలలో కూర్చోవడం వాళ్లకు కన్నీళ్లు తెప్పించింది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ ను భరించలేక గట్టిగా ఏడ్చేశారు. చివరికి తిండి తినడం, యూరిన్ కి కూడా అక్కడే వెళ్లాల్సి వస్తుంది. దీనితో వాళ్లిద్దరూ ఏడుపు లంఘించుకున్నారు. ఏడుస్తూ అభిజిత్ ని వీరిద్దరూ కౌగిలించుకున్నట్లు ప్రోమోలో చూపించారు. మరి వీరిద్దరిలో టికెట్ టు ఫినాలే ఎవరు గెలిచేవారనేది ఆసక్తికరంగా మారింది.