Asianet News TeluguAsianet News Telugu

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ట్రైలర్.. ఇది పక్కా మోస్ట్ అవైటెడ్ మూవీ!

1795 కాలం నాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబందించిన అంశతో సినిమా తెరకెక్కించారు. 225 ఏళ్ల క్రితం నాటి వాతావరణాన్ని ట్రైలర్ లో గొప్పగా చూపించారు. సముద్రాల్లో భారీ ఓడలు - అందులో జరిగే యుద్దాలు విజువల్ వండర్ ని గుర్తుచేస్తున్నాయి. 

Thugs Of Hindostan Trailer talk
Author
Hyderabad, First Published Sep 27, 2018, 3:26 PM IST

ఆలస్యంగా సినిమాలు రిలీజ్ చేసినా అమిర్ ఖాన్ నుంచి వచ్చే సినిమాలు చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. దంగల్ తో ప్రపంచానికి తన టాలెంట్ ను చూపించిన మిస్టర్ పర్ఫెక్ట్ మరోసారి అక్కటుకోవడానికి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`తో రాబోతున్నాడు. పైగా సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండడం మరింత ఆసక్తిని రేపుతోంది. 

నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. ఇక నేడు తెలుగు ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 

1795 కాలం నాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబందించిన అంశతో సినిమా తెరకెక్కించారు. 225 ఏళ్ల క్రితం నాటి వాతావరణాన్ని ట్రైలర్లో గొప్పగా చూపించారు. సముద్రాల్లో భారీ ఓడలు - అందులో జరిగే యుద్దాలు విజువల్ వండర్ ని గుర్తుచేస్తున్నాయి. సముద్రం మార్గం గుండా భారతదేశంలో ఆయుధాల వ్యాపారం పేరుతో బ్రిటిష్ రాజులు అడుగుపెట్టి దేశాన్ని ఎలా ఆధీనంలోకి తెచ్చుకున్నారనేది కథలో ఎలివేట్ చేశారు. 

బ్రిటిష్ వారిని అడ్డుకునేందుకు అమితాబ్ సైన్యం పోరాడుతుంది. అమితాబ్ పాత్ర సినిమాలో చాలా పవర్ఫుల్ అని అర్ధమవుతోంది అయితే అసలైన కథానాయకుడు అమిర్ ఖాన్ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. బ్రిటిష్ రాజులతో చేతులు కలిపి అమితాబ్ ను పట్టుకునేందుకు ఆయనవద్ద నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ పాత్ర ఏ విధంగా ఉంటుందనేది పూర్తిగా సినిమా చుస్తే గాని అర్ధం కాదు. 

ఇక కత్రినా గ్లామర్  గర్ల్ గా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.   'స్వాతత్య్రం నేరమైతే .. శిక్ష మాకు సమ్మతమే' అనే  అమితాబ్ పాత్ర చెప్పే డైలాగ్  చాలా బావుంది. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios