మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. గని, గాండీవధారి అర్జున, రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ ఇలా డిజాస్టర్స్ ఎదురయ్యాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. గని, గాండీవధారి అర్జున, రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ ఇలా డిజాస్టర్స్ ఎదురయ్యాయి. దీనితో వరుణ్ తేజ్ తన కెరీర్ ని చక్కబెట్టుకోవాలంటే ఈసారి తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ కరుణ కుమార్ దర్శత్వంలో మట్కా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ మూవీలో వరుణ్ తేజ్ కి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఈమెతో పాటు మరో ఇద్దరి హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

అందులో ఒకరు నోరా ఫతేహి. అదేంటి నోరా ఫతేహి ఐటెం బ్యూటీ కదా.. ఆమె హీరోయిన్ ఏంటి అనే సందేహం రావచ్చు. నోరా ఫతేహి ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె 36 రోజుల కాల్ షీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. నోరా ఫతేహి గతంలో బాహుబలి, టెంపర్ లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. 

ఇక మరొక హీరోయిన్ విషయానికి వస్తే ఆమె సలోని. రాజమౌళి మర్యాద రామన్న చిత్రంతో సలోని గుర్తింపు పొందింది. ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయిన సలోని ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తోందట. ఈ చిత్రంలో ఆమె పాత్రలో పొలిటికల్ టచ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ముగ్గురు హీరోయిన్లు మీనాక్షి, నోరా ఫతేహి, సలోని పాత్రల విషయంలో ఎలాంత్రం సంబంధం ఉండడం లేదు. కరుణ కుమార్ మాస్ అంశాలు ఉంటూనే వైవిధ్యమైన చిత్రం తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది.