Asianet News TeluguAsianet News Telugu

Balakrishna : ఈసారి ముగ్గురు హీరోయిన్లు.. బాలకృష్ణ - బాబీ మూవీపై క్రేజీ అప్డేట్.?

నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబోలో భారీ చిత్రం రాబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పటికే పట్టాలెక్కింది. ఈ సందర్భంగా మూవీలో హీరోయిన్లపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 

Three Heroines in Balakrishna and Bobby movie NBK109 NSK
Author
First Published Dec 6, 2023, 11:07 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)   బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య తన నెక్ట్స్ సినిమాలనూ అనౌన్స్ చేశారు. యంగ్ డైరెక్టర్ బాబీ (Bobby)  డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ అఫీషియల్ లాంచ్  జరిగి నాలుగైదు నెలలు దాటింది. 

బాలయ్య ప్రధాన పాత్రలో బాబీ కొల్లి ఓ వాయిలెంట్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రస్తుతం క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  పేరు వినిపిస్తోంది. అలాగే ఓ అగ్ర హీరోయిన్ కూడా నటిస్తుందని, మరో కీలక పాత్రలో ఇంకో నటిని ఎంపిక చేశారని అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ.. వీరసింహారెడ్డిలో - శృతిహాసన్, హనీరోజ్... భగవంత్ కేసరిలో - కాజల్ అగర్వాల్, శ్రీలీలా నటించారు. 

ఈసారి మాత్రం ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య వెండితెరపై అలరించబోతున్నారని తెలుస్తోంది. డిఫరెంట్ గా ప్రజెంట్ చేసేందుకు బాబీ కృషి చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది మొదటి అర్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఇప్పటికే ఒక్కో లుక్ తో తన సినిమాలను సక్సెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాబీ తెరకెక్కించే చిత్రంలోనూ డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తున్నారంట. గతంలోనే ఇందుకు సంబంధించిన లుక్ టెస్ట్, తదితర పనులు పూర్తైంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios