సినీ నటుడుని పెళ్లాడనున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య
ఈ నటుడుతో ఆమె గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఇక తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది రిలే.

ఎలన్ మస్క్ జీవితంలో ఏం జరిగినా సంచలనమే..ఏమి చేసినా సెన్సేషనే. గతేడాది అక్టోబర్ లో 44 బిలియన్ డాలర్లు వెచ్చించి (రూ. 3.59 లక్షల కోట్లు) ట్విట్టర్ ను కొనుగోలు చేశారు ఎలాన్ మస్క్. అప్పటి నుంచి ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ కు తనదైన స్టైల్ లో మార్పులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ పేరు, లోగోను మార్చేసి షాక్ ఇచ్చారు ఇకపై ట్విట్టర్ ను ఎక్స్ అని పిలవనున్నారు. లోగో కూడా బ్లూ బర్డ్ నుంచి ఎక్స్ సింబల్ కు మారింది. X.COM వెబ్ సైట్ కూడా ట్విట్టర్ కు రీడైరెక్ట్ అవుతుంది. ఈ తెలిసిన విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు ఆయన మాజీ భార్య తలులా రిలే ఓ పాపులర్ యాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.
ఎలన్ మస్క్, తలులా రిలే ..వీళ్లిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు. 2016 విడాకులు తీసుకున్నారు. ఇప్పడామె ఓ పాపులర్ యాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ థామస్ బ్రాడీ సాంగ్‌స్టర్ ని వివాహం చేసుకోనుంది. ఈ విషయమై అఫీషియల్ గా సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు.
ఈ నటుడుతో ఆమె గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఇక తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది రిలే. మాజీ భార్య మరో పెళ్లికి సిద్ధమవుతుందని తెలిసి ఎలాన్ మస్క్ రెడ్ హార్ట్ ఎమోజీతో కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. మరో ప్రక్క థామస్ బ్రాడీ సాంగ్‌స్టర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ద్వారా వారి నిశ్చితార్థం గురించి స్పష్టం చేశాడు. అయితే వీరి పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సిన విషయం.