బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ హీరో ప్రభాస్ తో ప్రకటించిన ఆదిపురుష్ మూవీపై ఎంతటి బజ్ ఉందో తెలిసిందే. దాదాపు 500కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతుంది. మొదటిసారి ఓ పౌరాణిక పాత్ర చేస్తున్న ప్రభాస్ రామునిగా నటించనున్నారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి పాత్ర చేసే అవకాశం దక్కడం అంటే చాలా మంది హీరోలు అదృష్టంగా భావిస్తారు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆ అవకాశం ప్రభాస్ కి దక్కింది. 

ఇక ప్రభాస్ రామునిగా చేస్తున్నాడన్న వార్త బయటికి వచ్చిన నాటి నుండి సీతగా ఎవరు అనే సందేహం ప్రేక్షకులలో మొదలైపోయింది. ఇంత భారీ చిత్రంలో అది  కూడా ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ పక్కన నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి పెరిగిపోయింది. అలాగే కొందరు హీరోయిన్స్ పేర్లు తెరపైకి రావడం జరిగింది. ముఖ్యంగా ఆదిపురుష్ లో సీత పాత్ర కోసం కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఆమె దాదాపు కన్ఫర్మ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. 

ఐతే దర్శకుడి దృష్టిలో హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఉన్నారట. టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా ఇమేజ్ ఉన్న కియారా మూవీకి హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. అలాగే ఆమె సీతగా ప్రభాస్ పక్కన బాగా సూట్ అవుతారని అనుకుంటున్నారట. ఐతే గతంలో కియారా లస్ట్ స్టోరీస్ అనే అడల్ట్ కంటెంట్ మూవీలో నటిచడం జరిగింది. దీనితో ఆమెను ప్రేక్షకులు సీత పాత్రలో ఒప్పుకుంటారా అనే సందేహం కలుగుతుందట.