బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు నాలుగు వారాల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఈ ఏడుగురిలో అవినాష్, అఖిల్, మోనాల్ మరియు అరియనా ఎలిమినేషన్స్ లో ఉన్నారు. ఈ నలుగురు ఇంటి సభ్యుల నుండి ఒకరు ఎలిమినేట్ కావాల్సి వుంది. ఐతే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం. మరో నాలుగు వారాల షో మిగిలివున్న నేపథ్యంలో ఇద్దరు మాత్రమే ఎలిమినేటై, టాప్ ఫైవ్ కొరకు ఐదుగురు సభ్యులు మిగలాలి. 

కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉండదని అంటున్నారు. ఐతే ఈ వారం బిగ్ బాస్ అవినాష్ ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. అవినాష్ ని ఎలిమినేట్ చేసి అతడు ఎవిక్షన్ పాస్ ద్వారా సేవ్ అయ్యేలా చూపిస్తారని అనిపిస్తుంది. ఎలిమినేషన్స్ నామినేటైన అవినాష్, అఖిల్ సేవ్ అయ్యే ఛాన్స్ కోసం పోటీపడగా, హారిక ఓటుతో అవినాష్ గెలిచాడు. అవినాష్ కి బిగ్ బాస్ వచ్చే రెండు వారాలలో ఒకసారి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం, ఎవిక్షన్ పాస్ ద్వారా ఉంటుందని చెప్పాడు. 

కాబట్టి ఈ వారం అవినాష్ ఎలిమినేషన్ హై డ్రామా ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో ఇంటిలో ఉన్న తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కోసం క్యాంపైన్ చేస్తున్నారు. ముఖ్యంగా అభిజిత్ ని గెలిపించాలని చాల మంది తాపత్రయ పడుతున్నారు. నాగబాబు కూడా అభిజిత్  లేదా అవినాష్ గెలవాలని అన్నారు. ఐతే అభిజిత్ గెలిచే అవకాశాలు ఎక్కువ అన్నాడు. జబర్ధస్త్ కమెడియన్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ అవినాష్ ని గెలిపించాలని కోరుకున్నారు.