Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పులిని బంధించే సీన్ ఎలా చేశారో చూస్తే షాక్ అవుతారు... జక్కన్న మామూలోడు కాదు!

దాదాపు నాలుగేళ్లు ఆర్ ఆర్ ఆర్ కోసం టీమ్ కష్టపడ్డారు. హాలీవుడ్ ప్రముఖులు సైతం దీన్ని విజువల్ వండర్ గా అభివర్ణిస్తున్నారు. అయితే ఒక్కోసీన్ తెరకెక్కించడానికి టీమ్ చాలా కష్టపడినట్లు మేకింగ్ వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది. 
 

this was how rajamouli shot the scene catching tiger by ntr
Author
First Published Aug 27, 2022, 11:49 AM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ ఇంట్రో సీన్ ఓ అద్భుతం. భారీ టైగర్ ని బంధించే క్రమంలో ఎన్టీఆర్ చేసే వీరోచిత పోరాటం ఆకట్టుకుంటుంది. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి చాలా గ్రౌండ్ వర్క్ జరిగిందని మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది. అలాగే ఆశ్చర్యం వేస్తుంది. దర్శకుడు రాజమౌళికి ఉన్న గొప్ప అలవాటు.. ప్రతి సన్నివేశాన్ని నటించి చూపించడం. ఈ సీన్ లో కూడా పులి స్థానంలో ఉండి ఎన్టీఆర్ పై అది ఎలా అటాక్ చేయాలో చూపించాడు. అక్కడ నిజంగా పులి లేకున్నప్పటికీ ఓ వ్యక్తి పులిగా నటించాలి. 

ఇక నిజమైన పులితో పోరాడుతున్నట్లు ఎన్టీఆర్ భావించారు. ఆ సంఘర్షణలో ఆకట్టుకునేలా రోప్ మూమెంట్స్ డిజైన్ చేశారు. దర్శకుడు రాజమౌళితో పాటు ఎన్టీఆర్, టీమ్ శక్తివంచన లేకుండా పని చేసి... వెండితెరపై ప్రేక్షకులకు గొప్ప అనుభూతి కలగడానికి కారణమయ్యారు. ఈ సీన్ కి సంబంధించిన మేకింగ్ వీడియో యూనిట్ విడుదల చేయగా వైరల్ గా మారింది. అలాగే ఎన్టీఆర్ బ్రిటీష్ కోటపై దాడి చేసే సీన్ కూడా మూవీలో ప్రధాన హైలెట్ గా నిలిచింది. పదుల సంఖ్యలో ఉన్న జంతువుల మధ్య నుండి ఎన్టీఆర్ జంప్ చేయడం అబ్బురపరిచింది. 

అలాగే మరొక హీరో రామ్ చరణ్ ఇంట్రో కూడా ఆర్ ఆర్ ఆర్ హైలెట్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. మొత్తంగా రాజమౌళి కష్టం, క్రియేటివిటీ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఓ విజువల్ వండర్ లా మార్చింది. అందుకే వరల్డ్ వైడ్ అద్భుత రెస్పాన్స్ దక్కింది. రూ. 1100 కోట్లకు పైగా గ్రాస్ అన్ని భాషల్లో కలిపి వసూలు చేసింది. ఓటీటీలో కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. 

అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలో కనిపించారు. డివివి దానయ్య దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios