స్వీటీ అనుష్క సినిమాల జోరు తగ్గించడం ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. బాహుబలి సినిమా తరువాత ఆమె స్టార్ హీరోల మాదిరి ఏడాదికి ఒక సినిమా కూడా చేయడం లేదు. గత ఏడాది ఓటిటి లో విడుదలైన నిశ్శబ్దం చిత్రం తరువాత ఆమె నూతన చిత్ర ప్రకటన చేయలేదు. కాగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగా ఆమె ఓ మూవీ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. 


40ఏళ్ల అమ్మాయికి 25ఏళ్ల అబ్బాయికి మధ్య జరిగే ఓ డిఫరెంట్ లవ్ స్టోరీలో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారని టాలీవుడ్ టాక్. ఐతే ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే అనుష్క అసలు పర్సనల్ విషయాలు షేర్ చేయరు. అలాగే ఫోటో షూట్స్ మాట అటుంచితే, క్యాజువల్ గా దిగిన ఫోటోలు కూడా పంచుకోరు. 


దీనితో అప్పుడప్పుడూ బయటికి వచ్చే అనుష్క ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య టి షర్ట్ ధరించి బొద్దుగా బుగ్గలతో ఉన్న అనుష్క ఫోటో ఒకటి నెట్ లో తెగ వైరల్ అయ్యింది. బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉందంటూ ఆ ఫోటోను ఫ్యాన్స్ వైరల్ చేశారు. ఐతే అది అనుష్క లేటెస్ట్ ఫోటో కాదని తేలింది. కాగా అనుష్క చార్లీ చాప్లిన్ బొమ్మ పక్కన స్మిలింగ్ ఫోజిచ్చిన ఫోటో ఒకటి నెట్ లో వైరల్ అవుతుంది. అది మాత్రం అనుష్క లేటెస్ట్ లుక్ అని తెలుస్తుంది.