Asianet News TeluguAsianet News Telugu

సమంతకు గుడి కట్టేందుకు అభిమాని ఎంత ఖర్చు చేశాడో తెలుసా?


ఇటీవల ఏపీలో సమంత అభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టారు. ఈ సంఘటన సంచలనం కాగా సమంత గుడికి అభిమాని ఎంత ఖర్చు చేశాడనే చర్చ నడుస్తుంది.
 

this is how much samantha fan spent for her temple ksr
Author
First Published Apr 30, 2023, 12:46 PM IST

స్టార్ లేడీ సమంత హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు. ఆమెకు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సమంతకు ఓ అభిమాని ఏకంగా గుడి కట్టాడు. సమంత పుట్టినరోజు ఏప్రిల్ 28న ఘనంగా ప్రారంభం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చుండూరు మండలానికి చెందిన సందీప్ తెనాలి హీరోయిన్ సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు సేవా కార్యక్రమాలకు అట్రాక్ట్ అయ్యాడు. దీంతో సమంతకు గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంటి ఆవరణలో కొంత స్థలం కేటాయించాడు. సమంతకు గుడి కట్టించాడు. 

సమంత పుట్టినరోజు ఘనంగా గుడికి ప్రారంభించాడు. తన కుటుంబంతో పాటు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నాడు. బంధుమిత్రులను పిలిచి భోజనాలు ఏర్పాటు చేశాడు.  ఇక ఈ గుడి కట్టడానికి సందీప్ గట్టిగానే ఖర్చు చేసినట్లు సమాచారం. విగ్రహం తయారీ, గుడి నిర్మాణానికి రూ. 5 లక్షలు అయ్యిందట. అయితే సమంత మీదున్న అభిమానంతో పోల్చుకుంటే ఇదేమీ ఎక్కువ కాదని ఆ అభిమాని భావిస్తున్నారట. 

గతంలో కుష్బూ, నమిత, హన్సిక తో పాటు పలువురు హీరోయిన్స్ కి అభిమానులు గుడులు కట్టారు. తమిళ తంబీలు సినిమా తారలను అమితంగా ప్రేమిస్తారు. తమిళనాడులో చాలా మంది హీరోయిన్స్ కి అభిమానులు గుడులు కట్టారు. 

  ఇక సమంత కెరీర్ పరిశీలిస్తే... ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios