హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ప్రదర్శించారు. విజయ్ దేవరకొండ చెంపఫై కొట్టే సీన్ చూస్తూ మృణాల్ చేసిన పని వైరల్ అవుతుంది.  

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ విజయ్ దేవరకొండకు బాగా కలిసొచ్చిన జోనర్. విజయ్ దేవరకొండ కెరీర్లో హిట్ చిత్రాలుగా ఉన్న పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఖుషి ఈ జోనర్లో తెరకెక్కినవే. ఫ్యామిలీ స్టార్ సైతం రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. దర్శకుడు పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న రెండో చిత్రం. విజయ్ దేవరకొండ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది గీత గోవిందం. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఆడియన్స్ లో మూవీపై ఆసక్తి పెంచేసింది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంది. ఇక మృణాల్ ఠాకూర్ గ్లామర్ కట్టిపడేస్తుంది. విజయ్ దేవరకొండ-మృణాల్ కాంబినేషన్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. లవర్స్ గా, భార్యాభర్తలుగా రెండు వేరియేషన్స్ చూపించారు. కాగా ట్రైలర్ చివర్లో విజయ్ దేవరకొండను మృణాల్ చెంపై కొట్టే సన్నివేశం ఉంది. 

''కోపం తీరిపోతుందంటే నన్ను కొట్టవే బాబు'' అని మృణాల్ ని విజయ్ దేవరకొండ అంటాడు. మృణాల్ నిజంగానే చెంపపై గట్టిగా కొట్టేస్తుంది. ఈ సీన్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ప్రదర్శించారు. ఆ పార్టిక్యూలర్ కొట్టే సీన్ వచ్చినప్పుడు మృణాల్ నవ్వు ఆపుకోలేకపోయింది. ట్రైలర్ చూస్తూ విజయ్ దేవరకొండ చెవిలో ఏదో చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

ఫ్యామిలీ స్టార్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుందని సమాచారం. రెండు వారాల తర్వాత హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తారట. ఫ్యామిలీ స్టార్ చిత్ర విజయం పై యూనిట్ విశ్వాసంగా ఉన్నారు. మరి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.. 

Scroll to load tweet…