సోషల్ మీడియా రోజులివి. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా యూత్ కాలక్షేపం జరుగుతోంది. అలాగే ఈ మీడియాలో రోజు రోజుకీ కొత్త కొత్త ఛాలెంజ్ లు వస్తున్నాయి. మొన్నటిదాకా ఫిట్ నెస్ ఛాలెంజ్ నడిస్తే..ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్ తో సెలబ్రెటీలు బిజీగా ఉన్నారు. అదే బాటిల్ క్యాప్ ఛాలెంజ్. సెలబ్రెటీలంతా ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ లో మునిగిపోయారు. ఇప్పటికే చాలా మంది ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తమ ఫ్యాన్స్ కు టార్గెట్ విసురుతున్నారు.  

ఇప్పుడు బాలీవుడ్  నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకు బాటిల్ క్యాప్ చాలెంజ్‌ ఫీవర్ పాకింది. హిందీ, తెలుగు సినీ రంగాలకు చెందిన ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌ ప్రారంభించిన బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌లో భాగంగా వీడియోలను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తున్నారు. వీరితో పాటు క్రీడారంగంలోని వారు కూడా ఈ చాలెంజ్‌లో భాగస్వాములౌతౌండటం విశేషం. తాజాగా టాలీవుడ్‌ యంగ్ హీరో సుధీర్‌ బాబు విభిన్నంగా బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ను పూర్తి చేసి ట్వీట్ చేసారు.

ముందుగా అక్షయ్‌ లాగే కాలితో బాటిల్‌ క్యాప్స్‌ ఓపెన్‌ చేసిన సుధీర్‌ బాబు, తరువాత బ్యాడ్మింటన్‌ ఆడుతూ బాటిల్‌ క్యాప్‌ను ఓపెన్‌ చేశాడు. సీనియర్ నటుడు అర్జున్ సైతం ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు. ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సైతం క్రికెట్ ఆడుతూ బాటిల్‌ క్యాప్‌ను ఓపెన్‌ చేసిన విషయం తెలిసిందే.