కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ‘విక్రాంత్ రోణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

కన్నడ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల్లో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రొటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. సూపర్ స్టార్ గా ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా తమిళం, హిందీ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుదీప్ చాలా సుపరిచితుడు. సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో.. నార్త్ లోనూ కిచ్చా సుదీప్ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు.

అయితే సుదీప్ హీరోగానే కాకుండా విలన్ గానూ కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఈగ’, ‘దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణ’ (Vikranth Rona)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అనుప్ భండారి దర్శకత్వం వహించారు. హీరోయిన్ నీతా అశోక్ సుదీప్ సరసన ఆడిపాడింది. జూలై 28న మూవీ ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే హింగ్లీష్ లోనూ మొట్టమొదటి సారి సుదీప్ వాయిస్ తో డబ్ చేశారు. 

ప్రస్తుతం మూవీకి సంబంధించి ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆయన్ను హీరోగా కాకుండా విలన్ గానే భావిస్తున్నారని కామెంట్ చేశారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ కు తను విలన్ గానే గుర్తుకువస్తున్నానని అన్నారు. ‘దబాంగ్’, ‘మక్కీ’ చిత్రాలతో ఆ ముద్రపడిందని తెలిపారు. తను చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ తీశానని గుర్తు చేయడం గమనార్హం. నార్త్ లో తనను విలన్ గానే గుర్తిస్తుండటం పట్ల సుదీప్ ఇలా కామెంట్స్ చేశారు. 

‘విక్రాంత్ రోణ’ను 3డీలో జులై 28ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, హిందీలో సల్మాన్ ఖాన్ ఈ మూవీ రిలీజ్ డేట్ టీజర్ ను లాంచ్ చేయడం విశేషం. పోస్టర్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) స్పెషల్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ‘రక్కమ్మ’ సాంగ్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.