Asianet News TeluguAsianet News Telugu

మహేష్ తో నటించిన ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే సితారకు మహా ఇష్టం అట... ఎవరో తెలుసా?

మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె తనకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్స్ పేర్లు చెప్పింది. వారిద్దరూ మహేష్ బాబుతో నటించడం విశేషం... 
 

these two heroine paired with mahesh babu are sitara favorite ksr
Author
First Published Aug 27, 2024, 7:30 PM IST | Last Updated Aug 27, 2024, 7:30 PM IST

మహేష్ బాబు కూతురిగానే కాకుండా సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది సితార ఘట్టమనేని. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ కి బాలీవుడ్ లో కూడా పరిచయాలు ఉన్నాయి. అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్స్ ఆమెకు టచ్ లో ఉంటారు. ఆ రేంజ్ పాపులారిటీ మైంటైన్ చేస్తుంది. సితార ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. సితార తరచుగా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంది. ఆమె వయసు కేవలం 12 ఏళ్ళు. మెచ్యూరిటీలో మాత్రం పాతికేళ్ల యంగ్ గర్ల్ ని తలపిస్తుంది. 

సితార సొంత సంపాదన కూడా స్టార్ట్ చేసింది. అంతర్జాతీయ నగల బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించింది సితార. ఇందుకు గాను ఆమె రూ. 1 కోటి పారితోషికం తీసుకుందట. ఈ మొత్తాన్ని సితార సామాజిక సేవకు ఖర్చు చేశారని సమాచారం. ఇటీవల సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. సితారకు తెలుగు పెద్దగా రావడం లేదు. దాదాపు ఇంగ్లీష్ లో సమాధానం చెబుతుంది. 

కాగా మహేష్ బాబుతో నటించిన ఇద్దరు హీరోయిన్స్ అంటే సితారకు చాలా ఇష్టం అట. వారు ఎవరో కాదు. రష్మిక మందాన, శ్రీలీల. ఈ ఇద్దరు హీరోయిన్స్ సితార ఫెవరేట్ అట. ఓ సందర్భంలో సితార ఈ విషయం వెల్లడించింది. రష్మిక మందాన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ తో జతకట్టింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఇక శ్రీలీల గుంటూరు కారం మూవీలో నటించింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా విడుదలైంది. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మహేష్ మేనియాతో గుంటూరు కారం రూ. 170 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. గుంటూరు కారం లో శ్రీలీల గ్లామర్ హైలెట్ గా నిలిచింది. నెక్స్ట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios