హోస్ట్ గా కింగ్ నాగార్జున రెండవవారం బిగ్ బాస్ వేదికపైకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతో హౌస్ లోని సభ్యులకు, ప్రేక్షకులకు జోష్ వచ్చి చేరింది. ఇంటి సభ్యులకు వినోదం పంచుతూనే, నాగార్జున కొందరికి షాక్ కూడా ఇచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన తొమ్మిదిమంది ఇంటి సభ్యులకు డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. దీనితో తొమ్మిది మందిలో ఇంటిని వీడాల్సిన ఆ ఇద్దరు ఎవరనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. 

ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో నటి కరాటే కళ్యాణి హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఆమెకు బిగ్ బాస్ బై చెప్పి సొంత ఇంటికి పంపారు. అలాగే ఎలిమినేషన్ లో ఉన్న గంగవ్వ  ఎలిమినేషన్ నుండి సేవ్ కావడం జరిగింది. కుమార్ సాయి, హారిక, మోనాల్, అభిజిత్, సోహైల్, అమ్మ రాజశేఖర్ మరియు నోయల్ ఎలిమినేషన్ లో ఉన్నారు. నేడు ఈ ఏడుగురు ఇంటి సభ్యుల నుండి ఒకరు ఎలిమినేటై వెళ్లిపోనున్నారు. 

ఐతే ఇప్పటికే సోషల్ మీడియాలో వీరిలో ఇంటిలో నుండి ఎలిమినేటి అయ్యేది ఎవరో వైరల్ అవుతుంది. ప్రేక్షకుల అంచనా, సర్వేల ఫలితాల ప్రకారం కుమార్ సాయి, అమ్మ రాజశేఖర్ తక్కువ ఓట్లు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. కాబట్టి నేడు హౌస్ నుండి వీరిద్దరిలో ఒకరు వెళ్లిపోయే అవకాశం కలదని అంటున్నారు. వీరిద్దరిలో కూడా అమ్మ రాజశేఖర్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి కొన్ని గంటల్లో దీనిపై స్పష్టత రానుంది.